Umme Ahmed Shishir : ‘హసన్’ మగాడు కానీ పక్కన పెట్టారు
బంగ్లా క్రికెటర్ భార్య ఉమ్మె అహ్మద్ శిశిర్
Umme Ahmed Shishir : ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని రీతిలో ఈసారి షాక్ తగిలింది స్టార్ ప్లేయర్లు. గత ఐపీఎల్ లో దుమ్ము రేపి స్టార్లుగా పేరొందిన వారందరినీ ఫ్రాంచైజీలు లైట్ తీసుకున్నాయి.
మొత్తం 590 మంది ఆటగాళ్లను తుది జాబితాకు ఎంపిక చేసింది బీసీసీఐ. బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు మెగా వేలాన్ని నిర్వహించింది.
ఇందులో రూ. 551.70 లక్షలు ఖర్చు చేసి 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. గతంలో 8 ఫ్రాంచైజీలు ఉండగా ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.
ఇందులో ఒకటి అహ్మదాబాద్ కాగా మరొకటి లక్నో. ఆటగాళ్ల విషయానికి వస్తే ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లుగా భావించిన వారికి బిగ్ షాక్ తగిలింది. వారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.
ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించిన జట్లకు విజయాలు అందించినా ఎందుకనో ఈసారి స్టార్ ఆటగాళ్ల జోలికి వెళ్లలేదు. ఇదే క్రమంలో గత ఐపీఎల్ లో ఆడిన బంగ్లా దేశ్ కు చెందిన షకీబ్ ఉల్ హసన్ కూడా అన్ సోల్డ్ లిస్టులోకి చేరి పోయాడు.
. దీంతో హసన్ భార్య ఉమ్మె అహ్మద్ శశిర్ (Umme Ahmed Shishir)స్పందించింది. మా ఆయన అద్భుతమైన ప్లేయర్ అని, అంతకంటే దమ్మున్నోడని కానీ ఎందుకని పక్కన పెట్టారో అర్థం కావడం లేదంటూ వాపోయింది.
లంక టూర్ లో ఉన్నందు వల్ల హసన్ ఐపీఎల్ వేలంలోకి రాలేక పోయాడంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. శిశిర్ ప్రముఖ మోడల్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసింది. ఆ తర్వాత హసన్ తో ప్రేమలో పడింది. అమెరికాలో చదువుకుంది.
Also Read : హిజాబ్ వివాదం గుత్తా జ్వాల ఆగ్రహం