Bappi Lahari : హిందీ చిత్ర సీమ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోయింది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరొందిన బప్పీలహరి ముంబైలో కన్ను మూశారు. ఆయన మరణంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
మొన్నటికి మొన్న లతా మంగేష్కర్ కన్ను మూస్తే ఇవాళ బప్పీల హరి వెళ్లి పోయాడు.
భారతీయ సినీ సంగీతంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు బప్పీల హరి(Bappi Lahari ). ఆయన వయసు 69 ఏళ్లు. బెంగాల్ లో 1952లో పుట్టారు.
తెలుగు వారికి కూడా ఆయన పరిచయం. చిరంజీవి స్పీడ్ కు తగ్గట్టుగా ఎన్నో పాటలు అందించారు.
స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్ ఉన్నాయి. 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు.
సినిమాలకే కాదు ఎన్నో ప్రోగ్రామ్స్ కు కూడా ప్రాణం పోశారు బప్పీల హరి.
ఒకే ధోరణితో వెళుతున్న హిందీ సంగీతానికి వెస్ట్రన్ టచ్ ఇచ్చాడు బప్పీలహరి. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది డిస్కో కింగ్ అని.
1980 నుంచి 1990 దాకా హిందీ చిత్ర పరిశ్రమను ఒక రకంగా చెప్పాలంటే శాసించారు.
తన సంగీత ప్రతిభా పాటవాలతో. ఇక ప్రముఖ గాయక దిగ్గజం కిషోర్ కుమార్ కు బంధువు కూడా అవుతారు.
బప్పీలహరి మంచి గాయకుడు కూడా. హిందీతో పాటు తెలుగు, తమిళ్ , కన్నడ, గుజరాతీ భాషల్లో సినిమాలకు సంగీతం అందించారు. ఇక బప్పీలహరి(Bappi Lahari )అసలు పేరు అలోకేష్ లాహిరి.
అమర్ సాంగీ, ఆశా ఓ భలో బాషా, అమర్ తుమీ, అమర్ ప్రేమ్ , మందిర , బద్నామ్ , తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది.
ఇక హిందీలో వార్దత్ , డిస్కో డాన్సర్ , నమక్ హలాల్ , షరాబి, డ్యాన్స్ డ్యాన్స్ , కమాండో, సాహెబ్ , గ్యాంగ్ లీడర్ , సైలాబ్ సినిమాలు అతడిని గొప్ప కంపోజర్ గా మార్చేలా చేశాయి.
మూడేళ్లప్పుడే తబలా వాయించడం నేర్చుకున్నాడు. అతనికి ఇష్టమైన కోట్ ఏమిటంటే గోల్డ్ ఈజ్ మై గాడ్.
డిస్కో పాటలకే కాదు చల్తే చల్తే, జఖ్మీ లోని పాటలకు మెలోడీ సాంగ్స్ అందించాడు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి.
Also Read : రష్మికతో శర్వానంద్ లవ్లీ సాంగ్