Chiranjeevi : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పీలహరి మృతి యావత్ భారత సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు సినీ ప్రముఖులు. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం తనకు ఉందని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).
ట్విట్టర్ వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ 69 ఏళ్ల వయసులో కన్ను మూశారు. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన సినీ దిగ్గజాలు బప్పీలహరి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బప్పిలహరితో తనకు మంచి అనుబంధందన్నారు మెగాస్టార్. తను అద్భుతమైన పాటలు అందించాడని గుర్తు చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడి బిగ్ హిట్ గా నిలిచాయన్నారు.
ఆ సినిమాలు అప్పట్లో ప్రజల వద్దకు చేరేలా చేశాయన్నారు. ఇందులో దివంగత ఎస్పీబీ పాత్ర కూడా ఉందన్నారు. బప్పీలహరి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వారు.
అలాగే తన లైఫ్ ను కూడా ఉండేలా చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే బప్పీలహరికి గోల్డ్ అంటే ఇష్టం. తన శరీరంపై ఎక్కువగా వాటిని ధరించి బయటకు వచ్చేవారు. గొప్ప సంగీత దర్శకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు మరో నటుడు మోహన్ బాబు.
బప్పీలహరిని కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను నటించిన మూడు సూపర్ హిట్ మూవీస్ కు సంగీతం అందించాడని లేడని తెలిసే సరికి నోట మాట రావడం లేదన్నారు.
తాను నటించిన రౌడీ ఇన్స్ పెక్టర్ , నిప్పురవ్వ మూవీస్ సంగీతం అందించాడు బప్పీలహరి. ఇవాళ ఆయన లేరంటే బాధగా ఉందన్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక బాలీవుడ్ సైతం తీవ్ర విషాదానికి లోనైంది.
Also Read : రష్మికతో శర్వానంద్ లవ్లీ సాంగ్