Shreyas Iyer : ఐపీఎల్ మెగా వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోతాడని అనుకున్న శ్రేయస్ అయ్యర్ కు కోల్ కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడి కంటే ఎక్కువగా ఇషాన్ కిషన్ అమ్ముడు పోయాడు.
ఇది విచిత్రం. ప్రధానంగా ఈసారి మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను పట్టించు కోలేదు ఫ్రాంచైజీలు. తాజాగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer )కు అరుదైన ఛాన్స్ దక్కింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా అతడిని ఈసారి జరిగే ఐపీఎల్ మెగా లీగ్ లో స్కిప్పర్ గా ప్రకటించింది.
ఇవాళ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. క్రీడాభిమానులు, యువతీ యువకులకు తీపి కబురు చెబుతున్నాం. మా జట్టుకు నూతన సారథి వచ్చేశాడు. అతడికి హృదయ పూర్వకంగా వెల్ కమ్ చెప్పండి అంటూ కోరింది.
ఈ మేరకు తమ సారథులతో కూడిన ఫోటోను కూడా షేర్ చేసింది. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు కేకేఆర్ కు సారథ్యం వహించిన కెప్టెన్లందరితో పాటు అయ్యర్ ను చేర్చింది కేకేఆర్.
గంగూలీ, మెకల్లమ్, గంభీర్ , కార్దీన్ , మోర్గాన్ తో పాటు అయ్యర్ కూడా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అయ్యర్ కెప్టన్ గా ఉన్నాడు. కానీ అతడిని కాదని రిషబ్ పంత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం.
గత సీజన్ లో రన్నరప్ గా నిలిచింది కేకేఆర్. కానీ ఈసారి ఎలాగైనా సరే కప్పు తీసుకు రావాలని అనుకుంటోంది. అందుకే అయ్యర్ కు అంత భారీ ధర వెచ్చించి తీసుకుంది.
Also Read : హిజాబ్ వివాదం గుత్తా జ్వాల ఆగ్రహం