Bhuvneshwar Kumar : భువీ రాణిస్తే ఓకే లేదంటే క‌ష్టం

ప‌రోక్షంగా హెచ్చ‌రించిన బీసీసీఐ

Bhuvneshwar Kumar : భార‌త క్రికెట్ జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన భువ‌నేశ్వ‌ర్ కుమార్(Bhuvneshwar Kumar) కెరీర్ ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది. ఇప్ప‌టికే టెస్టు సీరీస్ లో విఫ‌ల‌మైన ర‌హానే, పుజారాల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.

ఇదే విష‌యంపై సీరియ‌స్ గా స్పందించాడు అజింక్యా ర‌హానే. ఇక బీసీసీఐ చీఫ్ గంగూలీ ఆ మ‌ధ్య‌న ర‌హానే, పుజారా రంజీలో ఆడాల‌ని, అక్క‌డ రాణిస్తే బెట‌ర్ అని సూచించాడు.

లేక పోతే టెస్టుల్లో ఆడించ‌డం క‌ష్ట‌మేన‌ని స్ప‌ష్టం చేశాడు. విచిత్రం ఏమిటంటే ర‌హానే సార‌థ్యంలో ఆసిస్ టూర్ లో భార‌త జ‌ట్టు సీరీస్ గెలిచింది. ఇదే విష‌యంపై ర‌హానే సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

మైదానంలో తాను జ‌ట్టుకు స‌క్సెస్ తీసుకు వ‌స్తే మిగ‌తా వాళ్లు తామే చేసిన‌ట్లు చెప్పుకున్నారంటూ పేర్కొన్నాడు. అప్ప‌టి హెడ్ కోచ్ గా ఉన్న ర‌విశాస్త్రిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించాడు.

ఇక విష‌యానికి వ‌స్తే స్వ‌దేశంలో వెస్టిండీస్ తో జ‌రుగుతున్న టీ20లో స‌రైన ప్ర‌ద‌ర్శ‌న లేక పోతే ఇక క‌ష్ట‌మేనంటూ వార్నింగ్ బెల్స్ మోగించాడు. దీంతో మ‌నోడి ప‌రిస్థితి మ‌ళ్లీ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు.

ఈ సీరీస్ లో గ‌నుక భువీ రాణించ‌క పోతే ర‌హానే, పుజారా, ఇషాంత్ శ‌ర్మ‌, సాహాల స‌ర‌స‌న చేరి పోక త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా ఒక వేళ ర‌హానే, పుజారాలు రంజీలో రాణిస్తే నే టెస్టుల్లో ఆడే అవకాశం ల‌భిస్తుంది. తాజాగా ఫ‌స్ట్ వ‌న్డేలో 4 ఓవ‌ర్లు వేశాడు.

31 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Also Read : షేక్ ర‌షీద్ ను అభినందించిన జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!