Sakibul Gani : బీహార్ కు చెందిన సకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. కెరీర్ లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సకీబుల్ గని(Sakibul Gani )చరిత్ర సృష్టించాడు.
రంజీ ట్రోఫీలో భీమార్ తరపున ఆడాడు గని. కోల్ కతాలో జరిగిన మిజోరామ్ తో జరిగిన మ్యాచ్ లో రెచ్చి పోయాడు. మొత్తం 405 బంతులు ఎదుర్కొన్న సకీబుల్ గని 56 ఫోర్లు 2 సిక్సర్లతో 341 పరుగులు చేశాడు.
విచిత్రం ఏమిటంటే 2018 డిసెంబర్ లో హైదరాబాద్ తో జరిగిన రంజీ ఫస్ట్ క్లాస్ టోర్నీలో మధ్య ప్రదేశ్ కు చెందిన అజయ్ రోథెరా 267 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి పేరు మీద ఉన్న రికార్డును సకీబుల్ గని(Sakibul Gani )తిరగ రాశాడు.
22 ఏళ్ల వయసు కలిగిన గని 2019 లో బీహార్ తరపున ఆడాడు. చివరగా 2021లో రాష్ట్ర జట్టు కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు.
మిజోరామ్ తో ప్రారంభమైన రంజీ మ్యాచ్ లో బీహార్ ఇన్నింగ్స్ ప్రారంభంలో తమ టాప్ ఆర్డర్ ఆటగాళ్లను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 3 వికెట్లు కోల్పోయి 71 పరుగుల వద్ద ఉన్న సమయంలో క్రీజు లోకి వచ్చాడు సకీబుల్ గని.
బాబుల్ కుమార్ తో కలిసి నాలుగో వికెట్ కు 538 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 84.19 స్ట్రైక్ రేట్ వద్ద ఆడాడు.
ఇదిలా ఉండగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. అండర్ -19 జట్టుకు స్కిప్పర్ గా ఉన్న యశ్ ధుల్ తమిళనాడుతో సెంచరీ చేశాడు.
Also Read : భువీ రాణిస్తే ఓకే లేదంటే కష్టం