Priyanka Gandhi : మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
భారతీయ జనతా పార్టీ తనకు తలవంచని నాయకులను ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వారికి వేధింపులు కంటిన్యూ అవుతూనే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ తను కావాలని అనుకుంటే వెంటనే దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతుందన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో తలపండిన నాయకుడని కొనియాడారు.
అదే సమయంలో ఎక్కడా ఎవరికీ రాజీ పడక పోవడంతో కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఈ మేరకు లాలూకు సపోర్ట్ గా ఆమె ట్వీట్ చేశారు.
ఆయనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దాణా కుంభ కోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది కోర్టు. రాంచీ లోని సీబీఐ స్పెషల్ కోర్టు ఐదో కేసులోనూ దోషిగా పేర్కొంది.
కాగా ఇప్పటికే లాలూ యాదవ్ నాలుగు కేసుల్లో దోషిగా తేల్చింది కోర్టు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో దాణా స్కాం చోటు చేసుకుంది.
డొరాండా ట్రెజరీ నుంచి రూ. 139 కోట్ల రూపాయలు అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే వాడుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
1997లో లాటూ ప్రసాద్ యాదవ్ ను నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆయనతో పాటు 110 మంది ఉన్నారని తేల్చింది. మొత్తం 575 మంది సాక్షులను విచారించాక లాలూకు శిక్ష ఖరారు చేసింది.
Also Read : పవర్ లోకి వస్తాం నేరస్థుల తాట తీస్తాం