Rahane Pujara : ‘ర‌హానే..పుజారా’కు బీసీసీఐ షాక్

శ్రీ‌లంక టెస్ట్ సీరీస్ కు అవుట్

Rahane Pujara : భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించిన అజింక్యా ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బీసీసీఐ. ద‌క్షిణాఫ్రికా టూర్ లో ఆశించిన రీతిలో రాణించ‌లేదు.

ఆ త‌ర్వాత దేశీవాళి టోర్నీలో ఆడి స‌త్తా చాటాల‌ని, అప్పుడే తీసుకోవాలో లేదో అన్న విష‌యం ఆలోచిస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ. ఇదిలా ఉండ‌గా దాదా చెప్పిన‌ట్లుగానే ర‌హానే, పుజారా రంజీ (Rahane Pujara)మ్యాచ్ లో ఆడారు.

ర‌హానే సెంచ‌రీ చేస్తే సున్నాకే అవుట‌య్యాడు పుజారా. స్వ‌దేశంలో శ్రీ‌లంక టీంతో జ‌రిగే టెస్టు సీరీస్ కు ఇవాళ బీసీసీఐ జ‌ట్టును ఎంపిక చేసింది. భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ గా రోహిత్ శ‌ర్మ‌ను ఎంపిక చేసింది.

ఈ సీరీస్ కు ర‌హానే, పుజారాతో పాటు వృద్ధిమాన్ సాహాను ప‌క్క‌న పెట్టింది. ఇక టెస్టు కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఇటీవ‌ల మాజీ హెడ్ కోచ్ గా ప‌ని చేసిన ర‌వి శాస్త్రిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు అజింక్యా ర‌హానే(Rahane Pujara).

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 మెగా వేలం పాట‌లో పుజారా, ర‌హానే కూడా పోటీ ప‌డ్డారు. ఇందులో పుజారాను ఏ ఫ్రాంచైజీ ఆస‌క్తి చూప‌లేదు.

కానీ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కోటి రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది అజింక్యా ర‌హానేను. ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్న ర‌హానే రంజీలో సెంచ‌రీ సాధించడంతో కేకేఆర్ యాజ‌మాన్యం సంతోషంగా ఉంది.

కానీ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Also Read : నిరాశ ప‌రిచిన ఛ‌తేశ్వ‌ర్ పుజారా

Leave A Reply

Your Email Id will not be published!