Team India : భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఇవాళ కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టింది. భారత జట్టు(Team India) విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాతో పాటు వృద్ధి మాన్ సాహాను పక్కన పెట్టేసింది సెలెక్షన్ కమిటీ.
ఇవాళ ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాడు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.
ఈ సీరీస్ లకు రోహిత్ శర్మ సారథ్యంలో 18 ఆటగాళ్లను ఎంపిక చేసింది.
శ్రీలంకతో టీ20 సీరీస్ కు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కు పూర్తిగా విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారు.
ఎంపీకి చెందిన స్టార్ పేసర్ అవేష్ ఖాన్ భారత్ తరపున టీ20ల్లో అరంగ్రేటం చేస్తాడు.
విచిత్రం ఏమిటంటే సంజూ శాంసన్ ను తీరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం. గత ఐపీఎల్ 2021 లీగ్ లో దుమ్ము రేపాడు సంజూ.
టాప్ పరుగుల్లో శాంసన్ ఉన్నాడు. ఇదిలా ఉండగా గాయం కారణంగా కేఎల్ రాహుల్ , సుందర్ పక్కన పెట్టారు.
విండీస్ తో తీవ్ర గాయం కారణంగా తప్పుకున్న జస్పీత్ బుమ్రా ను తిరిగి తీసుకుంది బీసీసీఐ. యూపీ స్పిన్నర్ కు ఊహించని రీతిలో ఛాన్స్ ఇచ్చారు .
ఇక జట్ల పరంగా చూస్తే భారత టీ20 జట్టు రోహిత్ శర్మ కెప్టెన్, గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, హూడా, బుమ్రా, భువీ, దీపక్ చాహర్ , హర్షల్ పటేల్ , సిరాజ్ , సంజూ శాంసన్ , రవీంద్ర జడేజా, చహల్, బిష్ణోయ్ , కుల్దీప్ , అవేష్ ఖాన్((Team India) ఉన్నారు.
ఇక టెస్టు జట్టు పరంగా చూస్తే రోహిత్ శర్మ ఉన్నారు. మయాంక్, ప్రియాంక్ పంచల్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ , విహారి, శుభ్ మన్ , పంత్ , కేఎస్ భరత్ , ఆర్. అశ్విన్ , జడేజా, జయంత్ , కుల్దీప్ , బుమ్రా, షమీ, సిరాజ్ , ఉమేష్ , సౌరభ్ కుమార్ ఉన్నారు.
Also Read : నిరాశ పరిచిన ఛతేశ్వర్ పుజారా