Wriddhiman Saha : భారత జట్టు స్టార్ ప్లేయర్ గా పేరొందిన వృద్ది మాన్ సాహా సంచలన కామెంట్స్ చేశాడు. బీసీసీఐ తాజాగా శ్రీలంక సీరీస్ తో ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు సాహాను. వృద్ది మాన్ తో పాటు స్టార్ ప్లేయర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాను కూడా పక్కన పెట్టేసింది.
ఈ తరుణంలో కుండ బద్దలు కొట్టాడు. తనను ఎంపిక చేయక పోవడంపై స్పందించాడు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తీసుకునే విషయం పరిశీలిస్తానని చెప్పాడని కానీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రిటర్మైంట్ గురించి ఆలోచించమని సూచించాడని పేర్కొన్నాడు.
భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సారథ్యంలో శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. అందులో వృద్దిమాన్ సాహా పేరు లేదు.
ఈ విషయం తనకు ముందే తెలుసన్నాడు. తాను బీసీసీఐ బాస్ గా ఉన్నంత కాలం నువ్వుంటాన్న దాదా మాటలు ఒట్టి మాటలేనని అర్థమై పోయిందన్నాడు.
గత ఏడాది నవంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో 61 పరుగులు చేసినన తనను ప్రత్యేకంగా గంగూలీ అభినందించాడని గుర్తు చేసుకున్నాడు.
వాట్సాప్ లో అలా మెస్సేజ్ చూసే సరికల్లా తనకు మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలుగ చేసిందన్నాడు వృద్ది మాన్ సాహా(Wriddhiman Saha). ప్రస్తుతం చూస్తే అందుకు భిన్నంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు.
వర్చువల్ విధానంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతేన్ శర్మ టీమ్ ను డిక్లేర్ చేశాడు. ఇందులో నలుగురు స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టడం విచిత్రం కాక పోయినా రహానే సెంచరీ చేసినా పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
మొత్తంగా ఇక భవిష్యత్తులో జట్టుకు ఆడక పోవచ్చని వాపోయాడు.
Also Read : అర్జున్ టెండూల్కర్ ఆట చూడను