Yash Dhull : యశ్ ధుల్ మరోసారి సత్తా చాటాడు. అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. అండర్ -19 వరల్డ్ కప్ ను భారత్ కు తీసుకు వచ్చిన టీమ్ కు మనోడు కెప్టెన్ గా ఉన్నాడు.
తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన ఫీట్ సాధించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ , తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. యశ్ ధుల్ (Yash Dhull )ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా యశ్ ధుల్ మాత్రం అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో యశ్ ధుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు.
రెండో ఇన్నింగ్స్ లో సైతం సత్తా చాటి తనకు ఎదురే లేదని చాటాడు. ఇదిలా ఉండగా రంజీ ట్రోఫీలో అరంగేట్రం సాధించిన మూడో ప్లేయర్ గా రికార్డు తిరగ రాశాడు.
అంతకు ముందు గుజరాత్ కు చెందిన బ్యాటర్ నారీ కాంట్రాక్టర్ ఈ రికార్డు సాధించగా మరాఠా బ్యాటర్ అవతే రెండో ప్లేయర్ గా ఉన్నాడు. ప్రస్తుతం వారిద్దరి సరసన యశ్ ధుల్ నిలవడం విశేషం.
విచిత్రం ఏమిటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యశ్ ధుల్ 113 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో సైతం 113 రన్స్ చేశాడు. ఐపీఎల్ మెగా వేలం -2022 లో భాగంగా ఢిల్లీ ఫ్రాంచైజీ ఏకంగా ధుల్ ను రూ. 50 లక్షలకు దక్కించుకుంది.
మొదటి మ్యాచ్ లో నే సత్తా చాటిన యశ్ ధుల్ ను తాజా, మాజీ ఆటగాళ్లే కాదు ఢిల్లీ జట్టు యాజమాన్యం అభినందనలతో ముంచెత్తింది.
Also Read : ద్రవిడ్ పై సాహా సంచలన కామెంట్స్