EPF New Pension : ఈ దేశంలో అత్యధిక శాతం అసంఘటిత రంగంలోనే కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారు. వీరికి ఎలాంటి భద్రత ఉండడం లేదు. ఆయా కంపెనీల యాజమాన్యాల నిర్ణయాలపైనే వారి బతుకులు ఆధారపడి ఉన్నాయి.
దీంతో గతంలో కార్మిక చట్టాలలో అనేక రకాల మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. వారికి ఉచితంగా వైద్యంతో పాటు నెల నెలా కొంత మొత్తంలో పెన్షన్ సౌకర్యాన్ని అందించే యోచన చేస్తోంది సర్కార్.
ఇప్పటికే ఉద్యోగ భవిష్య నిధి – ఇపీఎఫ్ ఉంది. ఇది కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా పెన్షన్ పథకాన్ని(EPF New Pension) తీసుకు రావాలని అనుకుంటోంది.
రూ. 15, 000 వేల కంటే ఎక్కువ మూల వేతనం పొందుతున్న వారి కోసం ఈ పెన్షన్ పథకాన్ని (EPF New Pension)తీసుకు వస్తోంది. ప్రాథమిక జీతం పొందుతున్న ఉద్యోగులు ఇపీఎస్ -95 పరిధిలోకి రానున్నారు.
సంస్థలో అత్యధికంగా కంట్రిబ్యూషన్ ఉన్న వారికి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీనిని రూపొందిస్తోంది. వచ్చే మార్చి లో నిర్వహించే సమావేశంలో ఈ కొత్త పెన్షన్ సౌకర్యపు పథకానికి ఓ రూపకల్పన చేసే చాన్స్ ఉంది.
పెన్షన్ కొత్త పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తమ పూర్తి నివేదికను సమావేశంలో సమర్పించనుంది. అసంఘటిత కార్మికులకు నెల వారీ మూల వేతనం రూ. 25, 000 కు పెంచాలని ప్రతిపాదన చేయనున్నారు.
ఇందుకు కేంద్ర సర్కార్ ఒప్పు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త పెన్షన్ స్కీం అమలైతే గనుక దేశంలోని 50 లక్షల మంది కార్మికులు ఇపీఎస్ -95 పరిధిలోకి రానున్నారు.
Also Read : హార్వర్డ్ ఆహ్వానం కేటీఆర్ ప్రసంగం