ABG Ship Yard Case : దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం కు సూత్రధారిగా భావిస్తున్న ఏబీజీ షిప్ యార్డు మాజీ చైర్మన్ రిషి అగర్వాల్ విచారణ నిమిత్తం సీబీఐ దర్యాప్తు సంస్థ ఆఫీసుకు చేరుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. పలుసార్లు ప్రశ్నించింది. భారీ ఎత్తున బ్యాంకులు ఈ సంస్థకు అడ్డగోలుగా రుణాలు ఇచ్చాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు సంస్థపై, రిషి అగర్వాల్(ABG Ship Yard Case) పై ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇదిలా ఉండగా ఈ కేసు భారత దేశంలో అతి పెద్ద బ్యాంకు మోసంగా భావిస్తున్నారు.
రిషి అగర్వాల్ తో పాటు న్యాయవాది విజయ్ అగర్వాల్ తో కూడిన న్యాయ బృందం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఇదిలా ఉండగా సదరు న్యాయవాది 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు, ఐసీఐసీఐ వీడియోకాన్ కేసు, యెస్ బ్యాంకు రాణా కపూర్ కేసు మొదలైన వాటిని నిర్వహించడంలో పేరు పొందారు.
తాజాగా సీబీఐ ఓ ప్రకటనలో ఈ భారీ బ్యాంకుల స్కామ్ లో కీలక నిందితులంతా భారత్ లోనే ఉన్నారని తెలిపింది. ఎస్బీఐ 2019లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రిషి అగర్వాల్ పై ఎల్ఓసీని తెరిచింది.
సెంట్రల్ ఏజెన్సీ ప్రకారం ఏబీజీ షిప్ యార్డు (ABG Ship Yard Case)ఎస్బీఐతో పాటు మరో 28 బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 22, 842 కోట్ల రుణాలను డిఫాల్ట్ చేసింది.
బ్యాంకులు అడ్వాన్స్ గా ఇచ్చిన సీసీ లోన్ , టర్మ్ లోన్ , లెటర్ ఆఫ్ క్రెడిట్ , బ్యాంక్ గ్యారెంటీ మొదలైన వాటితో సహా వివిధ రకాల బ్యాంకు రుణాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. మొత్తంగా ఈ బ్యాంకు మోసం దేశాన్ని కుదిపి వేసింది.
Also Read : కమలంతో అకాలీదళ్ మళ్లీ దోస్తానా