Sawai Bhatt : ఆ గాత్రం ఒక్కసారిగా పాడటం మొదలు పెడితే చాలు ధూపమై అల్లుకు పోతుంది. గొంతులో మాధుర్యాన్ని, మట్టితనపు వాసనను పుణికి పుచ్చుకున్న ఆ గాత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా దేశాన్ని తాకడం ప్రారంభించింది.
పాటకు ఉన్న శక్తి ఇంకే దానికి లేదనేందుకు ఈ గాయకుడిని చూస్తే తెలుస్తుంది. ఇండియన్ ఐడల్ 12లో వెలుగులోకి వచ్చాడు సవాయి భట్(Sawai Bhatt). ప్రియురాలి కోసం ప్రియుడు పాడుకునే ప్రతి సందర్భంలోనూ సవాయి గుర్తుకు వస్తాడు.
హిమ్మేష్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో ఇటీవల విడుదల చేసిన సాంగ్ ఓ సజ్ నా దుమ్ము రేపుతోంది.
సంగీతపు హోరులో మైమరిచి పోయేలా చేస్తోంది. నెట్టింట్లో ఇప్పుడు ఈ పాట హల్ చల్ చేస్తోంది.
ఈ దేశంలో ఎందరో గాయనీ గాయకులున్నారు. కావాల్సిందల్లా ప్రోత్సాహం.
ప్రముఖ నటి రేఖ సైతం అతడి గాత్రంలో ఉన్న మాధుర్యానికి చలించి పోయింది.
ఆమే కాదు ఎవరైనా అతడి పాటకు ఫిదా అవ్వాల్సిందే. ఎక్కడో మారుమూల ప్రాంతానికి చెందిన
ఈ గాయకుడు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం బాధాకరం. ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక పోతే ప్రమాదం.
ఇలాంటి వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కళాకారులే కాదు కళాభిమానులపై కూడా ఉంది.
సవాయి భట్ లో పేరొందిన గాయకులతో పోటీ పడగల సత్తా ఉంది. అతడి వాయిస్ లోనే ఏదో తెలియని మార్మికత దాగి ఉంది.
సూఫీలోని ఆర్ద్రత, గుండెల్లో వ్యక్తం చేసే ప్రేమ ఇవన్నీ కలిస్తే ఆ జీరతో కూడిన దుఖఃం అద్భుతం.
ఇక సవాయి భట్ ది రాజస్థాన్ లోని నాగౌర్ లోని గచ్చి పురా ఊరు. జీవనోపాధి కోసం తండ్రితో పాటు వివిధ గ్రామాల్లో తోలు బొమ్మల ప్రదర్శన నిర్వహిస్తాడు.
విచిత్రం ఏమిటంటే సవాయి భట్ ఎవరి వద్ద శిక్షణ తీసుకోలేదు. ప్రకృతితో పాటే తను కూడా మమేకమై పోయాడు. పాడటం నేర్చుకున్నాడు స్వంతంగానే. 1998 లో పుట్టాడు.
ఇండియన్ ఐడల్ కు వచ్చాడు. ప్రపంచాన్ని ఆకర్షించాడు తన పాటలతో. తనతో పోటీ పడిన వారంతా ఇప్పుడు విదేశాలలో ప్రదర్శనలు ఇస్తున్నారు.
కానీ సవాయి భట్ మాత్రం ఇంకా పేదరికంతో ఇబ్బంది పడుతూనే ఉండడం బాధాకరం. దేశం కోసం ట్రిబ్యూట్ టు ది నేషన్ పేరుతో హిమ్మేష్ రేషమ్మియా సంగీతంలో పాడాడు.
ఇటీవల సవాయి పాడిన ఓ సజ్ నా అద్భుతం అని చెప్పక తప్పదు. ఎక్కడ చూసినా..విన్నా అతడి సాంగ్ మాత్రమే వైరల్ అవుతోంది. జానపదాలకు జీవం పోసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు సవాయి భట్((Sawai Bhatt).
వీలైతే మీరు కూడా సవాయి గొంతు వినండి. అతడి మాధుర్యానికి పడి పోతారు. మైమరిచి పోకుండా ఉండలేరు.
Also Read : కాలం చేసిన గాయం ‘మేకపాటి’ మరణం