TTD : శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం – టీటీడీ. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా తిరుమల దర్శనం కొంచెం ఇబ్బందికరంగా ఉండింది.
ప్రస్తుతం మహమ్మారి తగ్గు ముఖం పట్టడంతో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23 నుంచి ఆన్ లైన్ లో ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13 వేల చొప్పున రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా 26 నుంచి 28 మధ్య రోజుకు అదనంగా 5 వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు ఇస్తామని ప్రకటించింది.
ఈ ఆఫ్ లైన్ టికెట్లను తిరుమలలో భూదేవి కాంప్లెక్స్ ; శ్రీనివాసం, గోవింద రాజస్వామి సత్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేటాయించనున్నట్లు వెల్లడించింది.
అదనపు కోటాను అందుకే విడుదల చేస్తున్నామని పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ లో తిరుపతి కౌంటర్లలో ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
తిరుమలను దర్శించు కోవాలని అనుకునే భక్తులు తిరుపతిబాలాజీ.ఏపీ.గవ్.ఇన్ అనే వెబ్ సైట్ లింకును ఓపెన్ చేసి తీసుకోవాలని స్పష్టం చేసింది టీటీడీ.
అయితే బయట ఎక్కడా టికెట్లు ఇస్తామని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని సూచించింది. ఎవరైనా అలా చెబితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది టీటీడీ.
నిన్న ఒక్క రోజే భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు తిరుమలకు.
Also Read : తిరుమలలో అందరికీ ఒకటే భోజనం