#MangammaFoods : ఆన్‌లైన్‌లో మ‌న వంట‌కాలు క‌ళ క‌ళ‌

మ‌నోళ్ల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు వంట‌కాలు

Mangamma Foods: ఎంత సంపాదించినా తెలుగువారు తమ వంటకాలను మరిచి పోలేక పోతున్నారు. రుచికరంగా ఉండేలా వండుతుండడం తో భోజన ప్రియులు రుచిని ఆస్వాదిస్తున్నారు. దీంతో వంటమనుషులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఆహార పరిశ్రమ కోట్లాది రూపాయలను కుమ్మరించేలా చేస్తోంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.

ఇందు కోసం ప్రతి ఒక్కరు స్వంతంగా కంపెనీని ఏర్పాటు చేసి తామే వండి వడ్డిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడే వండిన వంట పదార్థాలు ఒక్క రోజు లేదా లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి. తెలుగు వారికి యెల్ల వేళలా అందుబాటులో ఉండేలా నిల్వ ఉండే పదార్థాలు , వంటకాలు సిద్ధం చేసే పనిలో ఫుడ్ ఇండస్ట్రీస్ నిమగ్నమయ్యాయి.

ఈ సమయంలో ఆహార పదార్థాలు అన్ని పూటలా అందుబాటులో ఉండేలా , రోజువారీగా అవసరమయ్యే అన్నింటిని ఆర్డర్ మీద డోర్ డెలివరీ చేస్తున్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ తో పాటు ఆల్ఫ్ లైన్ లో కూడా ఫుడ్ షాప్స్ , హోటల్స్, రెస్టారెంట్స్ లలో ఉంచుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫుడ్ నిర్వాహకులు డబ్బుల కంటే ఆహార పదార్థాలు మరింత నాణ్యవంతంగా, రుచి కరంగా ఉండేలా కృషి చేస్తున్నారు.

దీంతో తెలుగు వారి వంటలన్నీ ఇప్పుడు రెడీ టూ ఈట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. స్వగృహ , ఇంటి వంట తో పాటు మంగమ్మ ఫుడ్స్ కంపెనీలు ఇప్పుడు తాము తారలు చేసిన వంటకాలను ప్రధాన నగరాలలో ఫుడ్ ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. విపణిలోకి అమ్మమ్మ ఆహార పదార్థాలను విడుదల చేసింది. అప్పటికప్పుడు వండేందుకు సిద్ధంగా వున్న వంటకాలను మంగమ్మ ఫుడ్స్ అందిస్తోంది. తాము తయారు చేసిన కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది.

అమ్మమ బ్రాండ్ పేరుతో చపాతీ, పూరి , పరోటాలను రెడీ టూ ఈట్ పేరుతో ప్యాకెట్లను విడుదల చేసింది. తాజాగా ఉండడంతో పాటు , పోషక విలువలను జోడించి వీటిని తీసుకు వచ్చినట్లు సంస్థ నిర్వాహకులు నాగసాయి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ కోసం మొదటగా 25 లక్షల పెట్టుబడి పెట్టమని చెప్పారు. రోజుకు 40 వేల వరకు చపాతీలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది పూర్తి అయ్యేకల్లా లక్షకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. సాధారణ చపాతీలతో పాటు, రాగి, మెంతి, తృణ ధాన్యాలు, తదితర రకాలను అందిస్తున్నట్లు తెలిపారు.

No comment allowed please