Rohit Sharma : భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఊహించని రీతిలో కొందరు ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. గాయం కారణంగా దూరమైన రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేసింది శ్రీలంక టూర్ కు.
ఇదే సమయంలో క్రీడాభిమానులతో పాటు తాజా, మాజీ ఆటగాళ్లు విస్తు పోయేలా కేరళ స్టార్ ప్లేయర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది. ఇప్పటికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్ లో రాణించినా ఎంపిక కమిటీ చైర్మన్ పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో సంజూకు ఆడే ఛాన్స్ ఇచ్చింది.
ఈ సందర్భంగా శాంసన్ పై ప్రస్తుత ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ అద్భుతమైన ప్లేయర్. ఒక రకంగా చెప్పాలంటే బుల్లెట్ లాంటోడని పేర్కొన్నాడు.
టెక్నికల్ గా అతడిలో ఎలాంటి లోపం లేదన్నాడ. ఐపీఎల్ రిచ్ లీగ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ లను తల రాత మార్చే సత్తా ఉన్నోడని కితాబు ఇచ్చాడు రోహిత్ శర్మ.
ఇక టీమిండియాకు ఎంపికైనా సరైన రీతిలో రాణించ లేక పోవడం అతడి ఎంపికకు ప్రతిబంధకంగా మారింది. తాజాగా సూర్య కుమార్ యాదవ్ గాయపడడంతో సంజూ శాంసన్ కు అవకాశం కల్పించింది బీసీసీఐ.
టీమిండియా స్కిప్పర్ శాంసన్ పై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవడం విశేషం. రాబోయే వరల్డ్ కప్ లో కీలకం కానున్నాడని స్పష్టం చేశాడు. శాంసన్ బ్యాక్ ఫుట్ గేమ్ సూపర్ గా ఉంటుందన్నాడు.
Also Read : ఆ ముగ్గురిపై రోహిత్ కీలక కామెంట్స్