IND vs SL : లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే విండీస్ తో సీరీస్ నెగ్గిన టీమిండియా(IND vs SL ) జోరు కొనసాగుతూనే ఉంది.
69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో ఆతిథ్య జట్టు సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టు తరపున భువనేశ్వర్ కుమార్ , వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు తీశారు.
యుజ్వేంద్ర చాహల్ , రవీంద్ర జడేజాలు(IND vs SL ) చెరో వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉండగా ఇవాళ చాహల్ వికెట్ తీసి జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి టీ20 ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్ గా నిలిచాడు.
అంతకు ముందు భారత జట్టు టాస్ ఓడి పోయి బ్యాటింగ్ కు దిగింది. ఇషాన్ కిషన్ , శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంకపై కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోర్ సాధించింది.
199 పరుగుల టార్గెట్ ముందుంచింది ప్రత్యర్థి శ్రీలంక జట్టుపై. ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. సత్తా చాటాడు. ఏకంగా 89 పరుగులు చేశాడు. ముందండి జట్టును నడిపించాడు. భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు కిషన్.
ఇషాన్ తో కలిసి శ్రేయాస్ అయ్యర్ కేవలం 28 బంతులు మాత్రమే ఆడి ఏకంగా 57 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి లంకేయుల భరతం పట్టారు.
అంతకు ముందు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించారు. 44 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.
Also Read : ఆ ముగ్గురిపై రోహిత్ కీలక కామెంట్స్