Russia Ukraine War : ఉక్రెయిన్ పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. ఐక్య రాజ్య సమితి, నాటోతో పాటు అమెరికా యుద్దం ఆపమని కోరినా పట్టించు కోలేదు రష్యా చీఫ్ పుతిన్. ఉక్రెయిన్(Russia Ukraine War )ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందంటూ ఆరోపించారు.
ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా సైనిక దళాలు పంపిస్తోంది. రష్యా దళాలు దూసుకు పోతున్నాయి. బాంబుల మోత మోగుతోంది.
మిస్సైళ్లు ధ్వంసం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వందలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఉక్రెయిన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. చివరి వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఆ దేశ అధ్యక్షుడు. కానీ పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.
ఇదే సమయంలో రష్యా రక్షణ శాఖ మంత్రి తాము అనుకున్న టార్గెట్ పూర్తి చేశామన్నారు. అంతా తమ కంట్రోల్ లో ఉందన్నారు.
ఇదిలా ఉండగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరోపియన్ రాష్ట్రంపై జరిగిన అతి పెద్ద దాడిగా అభివర్ణించవచ్చు.
అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ తీవ్రంగా స్పందించారు. రష్యాపై ఆర్థిక ఆంక్షలను కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. తాము తీసుకున్న ఈ చర్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
కాగా మాస్కోకు వ్యతిరేకంగా పశ్చిమ కూటమి చేస్తున్న ప్రయత్నాలపై ఉక్రెయిన్ చీఫ్ వోలోడిమిర్ జెలెన్స్కీ. తమ దేశాన్ని రక్షించుకునేందుకు తాము ఒంటరిగా మిగిలి పోయామని అయినా ఈ పోరు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశాడు.
Also Read : పుతిన్ కు మాక్రాన్ వార్నింగ్