Wriddhiman Saha : సాహా కామెంట్స్ పై బీసీసీఐ ఆరా

గంగూలీ..ద్ర‌విడ్ ల పై వ్యాఖ్య‌లు

Wriddhiman Saha  : భార‌త క్రికెట్ ప్లేయ‌ర్ వృద్ది మాన్ సాహా చేసిన కామెంట్స్ తో కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. దేశం త‌ర‌పున ఆడే ప్ర‌తి క్రికెట‌ర్ భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి నియ‌మావళికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది.

ఆడే ముందు సంత‌కం కూడా చేస్తేనే ఎంపిక క‌మిటీ ప‌రిశీలిస్తుంది. మీడియాతో మాట్లాడేట‌ప్పుడు ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ త‌రుణంలో సాహా ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారారు.

బీసీసీఐ రూల్స్ కు వ్య‌తిరేకంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు భార‌త క్రికెట్ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ పై. బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ త‌న‌ను అభినందించాడ‌ని, తాను ఉన్నంత వ‌ర‌కు నీకు చోటు ఉంటుంద‌ని చెప్పాడంటూ వాట్సాప్ చాట్ ను బ‌ట్ట బ‌య‌లు చేశాడు.

ఇది పూర్తిగా క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కిందకు వ‌స్తుందంటూ సీరియ‌స్ అయ్యింది బీసీసీఐ. ఇదే స‌మ‌యంలో గంగూలీ సోద‌రుడు బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి సాహా(Wriddhiman Saha )త‌న బ్ర‌ద‌ర్ గంగూలీని లాగ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో సాహా కామెంట్స్ దేశ వ్యాప్తంగా ర‌చ్చ‌కు దారి తీసింది. ద్ర‌విడ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది బీసీసీఐ. దీనిపై రాహుల్ స్పందించాడు.

త‌న బాధ‌ను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, తానేమీ బాధ ప‌డ‌టం లేద‌న్నాడు. ఎందుకంటే గ‌తంలో కంటే ఇప్పుడు భార‌త జ‌ట్టులో పోటీ ఎక్కువ‌గా ఉంద‌న్నాడు.

11 మంది కావాలనుకుంటే క‌నీసం 60 మంది ఆడేందుకు రెడీగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ ప‌రిస్థితుల్లో జ‌ట్టులో చోటు క‌ష్ట‌మ‌న్నాడు.

సెంట్రల్ కాంట్రాక్ నిబంధ‌న ఉల్లంఘించ‌డంపై సాహాను బీసీసీఐ వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఆట‌గాళ్లు సంత‌కం చేసే వార్షిక సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లో రూ. 3 కోట్ల వార్షిక రిటైన‌ర్ షిప్ తో గ్రూప్ – బిలో కొన‌సాగుతున్నాడు.

Also Read : ఎట్ట‌కేల‌కు గెలిచిన భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!