Priyanka Chopra : రష్యా ఆకస్మిక దాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra )పిలుపునిచ్చారు. యునిసెఫ్ తరపున ఆమె ప్రతినిధిగా ఉన్నారు.
ఈ సందర్భంగా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు, ప్రతి దేశం దీనిని ఖండించాలని కోరారు. ఇదే సమయంలో ఏకపక్ష దాడుల కారణంగా నిరాశ్రయులైన వారిని, బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్ఫథంతో ముందుకు రావాలని సూచించారు.
ఈ తరుణంలో యుద్దం చేసే సమయం కాదని కానీ శాంతి ఒక్కటే పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక గాంధీ(Priyanka Chopra )స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్దంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
మరెందరో నిరాశ్రయులుగా మారారు. వారంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారు బాగుండాలని మనమంతా కోరుకుందాం. మిగతా ప్రపంచం కూడా అదే కోరుకుంటోంది.
ఇక్కడ ప్రతి ఒక్కరు బతకాలని కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే సంతోషంగా ఉండాలని అనుకోవడం, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకోవడం వల్లనే ఇలాంటి అనర్థాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించు కోవాలని సూచించారు. ఇదే సమయంలో సామాన్య పౌరులను టార్గెట్ చేయడం మంచిది కాదని ఆమె పుతిన్ ను కోరారు.
ఈ యుద్ద సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు సబ్ వే స్టేషన్ లను భూగర్భ బంకర్ లుగా ఎలా మార్చారో చూపిస్తూ వీడియోను కూడా షేర్ చేసింది ప్రియాంక చోప్రా.
Also Read : అది అబద్దం మేమిద్దరం స్నేహితులం