Ukraine President : రష్యా దాడుల మోత మోగిస్తోంది. ఇప్పటికే పలు నగరాలను చేజిక్కించుకుంది. ఓ వైపు బాంబుల మోత ఇంకో వైపు క్షిపణుల దాడులతో దద్దరిల్లుతోంది.
ఎక్కడ కూడా ఉక్రెయిన్(Ukraine President )ఎదురు దాడి చేయకుండా చేతులెత్తేసింది. భయంతో ప్రజలు పెద్ద ఎత్తున బంకర్లలో తలదాచుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలపై దాడులకు పాల్పడడాన్ని ఐక్య రాజ్య సమితి తప్పు పట్టింది.
నాటోతో పాటు అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యాయి. ఎయిర్ బేస్ , సైనిక బేస్ లను టార్గెట్ చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పగ పట్టారు. ప్రస్తుతం ఆ నగరానికి మంచి పేరుంది.
ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఉంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడమే రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్ చేశారని ఆరోపించారు.
మొదట తనను లేకుండా చేయడం. ఆ తర్వాత తన కుటుంబాన్ని మట్టు పెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉక్రెయిన్ కు ఆయుధంగా ఉన్న బలాలపై ఫోకస్ పెట్టారు.
ఒక్కొక్క దానిని కొట్టుకుంటూ, కూల్చుకుంటూ వెళుతోంది రష్యా. ఇదే సమయంలో చెర్నో బిల్ ను చేజిక్కించుకుంది. ఇప్పటికే కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా నాశనం చేసింది.
ఇంటర్నెట్ వ్యవస్థను లేకుండా చేసింది. కీవ్ పైనే ఎక్కువగా రష్యా ఫోకస్ పెట్టడం తీవ్ర నిరాశకు లోను చేస్తోంది. ఇదిలా ఉండగా పలు దేశాలకు చెందిన వారంతా ఉక్రెయిన్ లో కొలువు తీరారు. ఇదే సమయంలో భారత దేశానికి చెందిన విద్యార్థులు అక్కడే కొలువు తీరారు.
Also Read : మారణ హోమం విషాదకరం