Ashish Nehra : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక తో జరుగుతున్న టీ20 సీరీస్ లో అతడిని ఎంపిక చేయడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ లో జరిగే టీ20లో ప్రతిభ చూపాల్సిన అవసరం ఉందన్నాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ తరుణంలో బుమ్రాకు కొంచెం రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
వరల్డ్ కప్ భారత్ పరం కావాలంటే చాలా కష్ట పడాల్సి ఉందన్నాడు. మిగతా ఆటగాళ్లను కూడా వాడు కోవాలని సూచించింది. మిగతా ఆప్షన్లు పరిశీలించాలని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు సూచించాడు.
బుమ్రాను ఆడించడం తాను తప్పు పట్టడం లేదని, కానీ ఇంకా చాలా మంది బౌలర్లు ఉన్న సమయంలో ఎందుకు ఆడించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించాడు.
బుమ్రాతో పాటు భవనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ తో పాటు ఆవేష్ ఖాన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడారని గుర్తు చేశాడు. బుమ్రా జట్టులోకి తీసుకుంటే వీళ్లందరినీ పక్కన పెట్టాల్సి వస్తుందన్నాడు.
వీళ్లంతా బెంచ్ కే పరిమితమై పోతారని పేర్కొన్నాడు. మిగతా వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. రవీంద్ర జడేజా తిరిగి రావడం కొంత మేరకు శుభ పరిణామమేనని అన్నాడు ఆశిష్ నెహ్రా(Ashish Nehra).
బుమ్రా అద్భుతమైన ప్లేయర్ కానీ అతడికే అన్ని ఛాన్స్ ఇస్తే ఎలా అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆశిష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : తలవంచిన శ్రీలంక చెలరేగిన భారత్