IND vs SL 2nd T20 : రోహిత్ సేన అనుకున్నట్టుగానే అంచనాలకు మించి ఆడుతోంది. శ్రీలంతో జరిగిన టీ20 రెండో వన్డే మ్యాచ్ లో భారత బ్యాటర్లు లంకేయులను ఉతికి ఆరేశారు.
టాస్ గెలిచిన స్కిప్పర్ రోహిత్ శర్మ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది టీమిండియా. ఇంకా ఇంకో మ్యాచ మిగిలి ఉండగానే భారత్ టీ20 సీరీస్ కైవసం చేసుకుంది.
లంక ముందుంచిన 184 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా అందుకుంది.
కేవలం 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 17 బంతులు మిగిలి ఉండగానే విజయం దక్కించుకుంది. దాంతో 7 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది
. శ్రేయస్ అయ్యర్ 44 బంతులు ఆడి 6 ఫోర్లు 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
చాలా గ్యాప్ తర్వాత వచ్చిన స్టార్ ప్లయేర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టన్ గా ఉన్న సంజూ శాంసన్ చెలరేగి ఆడాడు.
25 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 18 బంతులు ఆడి 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 7 ఫోర్లు ఓ సిక్సర్ ఉన్నాయి. దీంతో టీమిండియాకు వరుసగా ఇది 11వ సారి టీ20లో కంటిన్యూగా విజయం సాధించడం.
ఇది కూడా ఓ చరిత్రే. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక(IND vs SL 2nd T2) భారీ స్కోర్ సాధించింది.
శనక 19 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శనక 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ నిస్సంకే 53 బంతులు ఎదుర్కొని 75 పరుగులు చేశాడు.
ఇందులో కళ్లు చెదిరే షాట్స్ తో అలరించడు.వీరు బాగా ఆడడంతో స్కోర్ పెరిగింది.. భారత్ సునాయసంగా విజయం నమదు చేసింది.
Also Read : ఐపీల్ ఫార్మాట్ బీసీసీఐ డిక్లేర్