Olena Zelenska : ఓ వైపు యుద్దం ఆగడం లేదు. మరోవైపు బాంబుల మోత మోగుతూనే ఉంది. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఇంకా పోరాటానికి సై అంటూనే ఉన్నారు. రష్యా మాత్రం తన దారిన తాను వెళుతూనే ఉంది.
ఎవరినీ లెక్క చేయడం లేదు. ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ ఆ దేశ చీఫ్ భార్య ఒలెనా జెలెన్ స్కా(Olena Zelenska )స్పందించింది. ఆమె తీవ్ర భావోద్వేగంతో తన ఆవేదనను పంచుకుంది.
ప్రియమైన ఉక్రెయిన్ వాసులారా, ప్రజలారా ఇది అత్యంత క్లిష్ట సమయంతో. యుద్ద బీభత్సం కొనసాగుతూనే ఉంది. మనం ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోలేదు. కేవలం శాంతిని మాత్రమే అనుసరించాయి.
కానీ ఈ కష్ట కాలంలో నా భర్త దేశ అధ్యక్షుడు పక్కన కూడా నేనుండాలి. కానీ అది వీలుపడడం లేదు. నా పిల్లలు నా వైపే చూస్తున్నారు. నా అవసరం ఆయన కంటే చిన్నారులకు ఉందని స్పష్టం చేసింది.
అయినా నేను, నా శరీరం, మెదడు అంతా మీ వైపే చూస్తున్నాయని స్పష్టం చేసింది. మీరు అలుపెరుగని రీతిలో చేస్తున్న పోరాటం నన్ను మరింత ఆలోచింప చేసేలా చేస్తోంది.
ఈ మాతృభూమి కోసం మీరు చేస్తున్న యుద్దాన్ని చూసి నా మనసు ఉప్పొంగుతోంది. ఈ గడ్డపై కలిసి బతికినందుకు అంతకంటే ఆనందంగా ఉందన్నారు.
తాను యుద్దం నుంచి వైదొలిగే ప్రసక్తి లేదంటున్నారు ఉక్రెయిన్ చీఫ్. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మనో ధైర్యం నింపుతోంది ఒలెనా జెలెన్ స్కా(Olena Zelenska ). భర్తకు తోడుగా దేశం కోసం పోరాడుతోంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆమెను చూసి గర్వ పడుతోంది.
Also Read : దమ్ముంటే రండి కాల్చండి చూద్దాం