Womens World Cup 2022 : ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ ముగిసింది. ప్రస్తుతం మహిళల ప్రపంచ కప్ (Womens World Cup 2022) మహిళల ప్రపంచ కప్సమరానికి సిద్దమైంది. న్యూజిలాండ్ వేదికగా ఈ కప్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ మొత్తం నెల రోజుల పాటు జరగనుంది.
31 రోజుల కాలంలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. మహిళా క్రికెట్ ప్రపంచాన్ని ఇప్పటి దాకా శాసిస్తున్న ఆసిస్, ఇంగ్లండ్ లతో పాటు న్యూజిలాండ్ హాట్ ఫెవరేట్ గా ఉన్నాయి.
భారత్ సహా మిగిలిన ఐదు టీమ్ లు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐసీసీ మహిళల వరల్డ్ కప్ జరగనుండడం విశేషం. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వరల్డ్ కప్ సాఫీగా సాగనుంది.
ఆతిథ్య హోదాలో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటికే అర్హత సాధించింది. ప్రస్తుతం ఉన్న ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, దక్షిణాఫ్రికా కు చాన్స్ ఇచ్చింది.
పాకిస్తాన్, వెస్టిండీస్ , బంగ్లాదేశ్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా మొదటిసారిగా బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లో పాల్గొననుంది. ఇదిలా ఉండగా ఈనెల 4 నుంచి ఏప్రిల్ 3 దాకా 6 వేదికల్లో 31 మ్యాచ్ లు జరగనున్నాయి.
ఏప్రిల్ 3న క్రైస్ట్ చర్చ్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రతి జట్టు మిగిలిన ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ -4 లో నిలిచిన టీమ్ లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.
ఒక వేళ ఇరు జట్లు సమంగా పాయింట్లు సాధిస్తే రన్ రేట్ ను పరిగణలోకి తీసుకుంటారు. డీఆర్ఎస్ ఈసారి నుంచి అమలులోకి రానుంది.
ఇక టీమిండియా విషయానికి వస్తే 6న పాకిస్తాన్ , 10న న్యూజిలాండ్ , 12న వెస్టిండీస్ , 16న ఇంగ్లండ్, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్ , 27న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఇక వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కింద చూస్తే ఈసారి భారీగా పెంచింది ఐసీసీ. విన్నర్ కు రూ. 10 కోట్లు, రన్నరప్ కు రూ. 4 కోట్ల 54 లక్షలు, సెమీస్ లో ఓడిన జట్లకు చెరో రూ. 2 కోట్ల 26 లక్షలు అందజేస్తోంది ఐసీసీ.
ఇక భారత జట్టు పరంగా చూస్తే ఇలా ఉంది. మిథాలీ రాజ్ స్కిప్పర్ గా హర్మన్ ప్రీత్ వైస్ కెప్టెన్ , స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రకర్ , మేఘన సింగ్ , రేణుక సింగ్ , తానియా, రాజేశ్వరి, పూనమ్ యాదవ్ ఉన్నారు.