Mithali Raj : యావత్ ప్రపంచం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ -2022 ప్రారంభానికి సిద్దమైంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ సంబురంలో 8 జట్లు పాల్గొంటున్నాయి.
మొత్తం టోర్నీ 31 రోజుల పాటు సాగనుంది. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టుకు హైదరాబాదీ స్టార్ ప్లేయర్ , ప్రస్తుత జట్టు స్కిప్పర్ మిథాలీ రాజ్ సంచలన ప్రకటన చేసింది. ఈ లీగ్ ముగిశాక తాను తప్పుకుంటున్నట్లు తెలిపింది.
తన మనసులో మాటను బయట పెట్టింది. టోర్నీలో భాగంగా ఈనెల 6న భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఇదిలా ఉండగా క్రికెట్ కు సంబంధించి తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడింది మిథాలీ రాజ్. కెరీర్ లో అడుగు పెట్టాక 2000లో జరిగిన ప్రపంచకప్ లో ఆడాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆడుకుంటూ వస్తూనే ఉన్నాయి.
ఇక ఎంతకాలం ఆడాలి. నేను నిష్క్రమిస్తే ఇంకొకరికి చోటు దక్కుతుందని పేర్కొంది మిథాలీ రాజ్. అంతే కాదు ఆనాడు న్యూజిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో ఉన్నా.
ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తాను కెప్టెన్ గా మరోసారి ప్రపంచ కప్ లో ఆడుతున్నా. చూస్తూ ఉండగానే కాలం వెళ్లి పోతోంది. ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. ఇంకెన్నో జ్ఞాపకాలు సేద దీరాయి.
ఇక ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎప్పుడో ఒకప్పుడు పుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్న మైందని స్పష్టం చేసింది మిథాలీ రాజ్.
ఈ అరుదైన జర్నీని వరల్డ్ కప్ టైటిల్ తో ముగించాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్పూర్తి పొందుతారని పేర్కొంది.