IND vs SL 1st Test : స్వదేశంలోని మొహాలిలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో లంచ్ విరామ సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆశించిన రీతిలో ఆడలేక పోయాడు. అతడితో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పెవిలియన్ బాట పట్టారు.
ఇద్దరూ పరుగులు చేయడంలో ఫోకస్ పెట్టినా బిగ్ స్కోర్ చేయలేక చేతులెత్తేశారు. స్కిప్పర్ రోహిత్ శర్మ(IND vs SL 1st Test) 29 పరుగులు చేస్తే మయాంక్ 33 రన్స్ చేసి నిరాశ పరిచాడు. ప్రస్తుతానికి హనుమ విహారి, వందో టెస్టు మ్యాచ ఆడుతున్న విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు.
విహారీ 30 రన్స్ చేస్తే కోహ్లీ 15 పరుగులతో ఆడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇండియా టీంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. ఇదిలా ఉండగా తన క్రికెట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ 100వ టెస్టు ఆడుతున్నాడు. ఒక రకంగా అరుదైన ఘనతే అని చెప్పక తప్పదు.
ఒక ఆటగాడు ఈ మధ్య కాలంలో ఇన్ని టెస్టులు ఆడడం చాలా కష్టం . అరుదైన ఫీట్ ను సాధించడంలో సక్సెస్ అయ్యాడు కోహ్లీ. భారత మాజీ కెప్టెన్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సన్మానించింది.
ఈ కార్యక్రమంలో కోహ్లీ భార్య అనుష్క కూడా పాల్గొంది. ఇదే క్రమంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీకి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
Also Read : ఆ ఇద్దరూ లేకుండానే బరిలోకి