Chennai Mayor Priya : చెన్నై న‌గ‌రం ద‌ళిత మ‌హిళ‌కు ప‌ట్టం

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న స్టాలిన్

Chennai Mayor Priya : ప‌ట్ట‌ణ, పురపాలిక ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసి రికార్డు సృష్టించిన డీఎంకే చీఫ్‌, సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ద‌ళిత‌, బీసీ, మైనార్టీల‌కు ప్ర‌యారిటీ ఇచ్చారు.

తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇచ్చిన హామీ మేర‌కు ఆచ‌ర‌ణ‌లో చూపించారు. తాజాగా తొలిసారి ద‌ళిత మ‌హిళ‌కు చెన్నై న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గా ఎంపిక‌య్యారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. ఇప్ప‌టికే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది డీఎంకే. ఇవాళ డీఎంకే మిత్ర ప‌క్ష పార్టీ సీపీఎంకు చెందిన అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన 29 ఏళ్ల ఆర్. ప్రియ మేయ‌ర్ (Chennai Mayor Priya)గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉండ‌గా తొలి ద‌ళిత మ‌హిళగా చ‌రిత్ర సృష్టించారు. ఇది రికార్డుల్లో ఎక్కింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన మహిళ‌కు ప‌ట్టం క‌ట్టిన ఘ‌న‌త త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతేవ కాకుండా చెన్నై మేయ‌ర్ అయిన మూడో మహిళ‌గా నిలిచారు. కాగా చెన్నై మేయ‌ర్ గా తారా చెరియ‌న్ , కామాక్షి జ‌య రామ‌న్ ప‌ని చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చెన్నై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కౌన్సిల‌ర్ గా విజ‌యం సాధించారు.

అత్యంత చిన్న వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తిగా నిలిచారు. తీనాంపేట 98వ వార్డు నుంచి గెలుపొందారు. జీసీసీలో 200 వార్డులు ఉండ‌గా డీఎంకే 153 స్థానాలు గెలిస్తే అన్నాడీఎంకే 15, కాంగ్రెస్ 13, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు 5, సీపీఎం 4, వీసీకే 4 , బీజేపీ 1 స్థానం గెలుపొందాయి.

Also Read : మ‌హిమా దాట్ల‌కు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!