IPL 2022 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 సంబురానికి సిద్దమైంది. ప్రపంచంలోనే అత్యంత రిచ్ లీగ్ గా పేరొందింది ఐపీఎల్. భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ క్రికెట్ పండుగ కొనసాగుతూ వస్తోంది.
గత 14 సీజన్ల దాకా ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈసారి జరిగే 15వ సీజన్ లో కొత్తగా రెండు జట్లు చేరాయి. దీంతో మొదటిసారిగా బరిలో 10 జట్లు పోటీ పడనున్నాయి.
బీసీసీఐకి ఊహించని రీతిలో ఐపీఎల్ వేలం పాటలో ఏకంగా రూ. 1725 కోట్ల రూపాయలు దక్కాయి. ఇది ప్రపంచ క్రీడా చరిత్రలో ఓ రికార్డుగా భావించాలి. ఏ క్రీడా సంస్థకు లేని ఆదాయం బీసీసీఐకి ఉంది.
రాబోయే రెండేళ్లలో దాని ఆస్తులు మొత్తం రూ. 50 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇక ఐపీఎల్ ఆటగాళ్ల వేలం బెంగళూరు వేదికగా జరిగింది. అన్ని ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్లను తీసుకున్నాయి.
ఇక ఐపీఎల్ టోర్నీ 2022కు(IPL 2022) సంబంధించి బీసీసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబై లోని వాంఖడే స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది.
దీంతో ఐపీఎల్ రిచ్ లీగ్ ప్రారంభమవుతుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈసారి పాత పద్దతిలోనే ఐపీఎల్ నిర్వహిస్తోంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు రెండో మ్యాచ్ చేపడుతుంది. మొత్తం మీద ఈసారి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా బరిలోకి దిగనుండడంతో క్రీడాభిమానులకు ఎక్కడ లేని జోష్ నింపనుంది ఐపీఎల్.
Also Read : సాహాపై బోరియా పరువు నష్టం దావా