Famous Feminsts : అసాధార‌ణ మ‌హిళ‌లకు స‌లాం

మ‌హిళ‌ల జీవితాల కోసం పోరాటం

Famous Feminsts : వాళ్లు స్త్రీవాదులుగా పేరు పొందారు. కానీ వాళ్లంతా త‌మ జీవితాంతం మ‌హిళ‌ల కోసం, స‌మాజం కోసం పోరాటం చేశారు. వివిధ రంగాల‌కు చెందిన వాళ్లు. కానీ త‌మ‌దైన శైలితో మ‌హిళ కోసం ప‌ని చేశారు.

ఇంకా చేస్తూనే ఉన్నారు. త‌మ అలుపెరుగ‌ని కృషితో సాధార‌ణ భార‌తీయ మ‌హిళ‌ల జీవితాల్లో భారీ మార్పును తీసుకు వ‌చ్చారు.

వీరిలో స్త్రీవాదులు ఉన్నారు. మ‌హిళ‌ల కోసం త‌మ గొంతును వినిపిస్తున్నారు.

వీరిలో క‌మలా భాసిన్ ఒక‌రు. సామాజిక శాస్త్ర‌వేత్త‌, స్త్రీవాదిగా ముద్ర ప‌డ్డారు. కొన్నేళ్లుగా విద్య‌, అభివృద్ధి

, మీడియా, లింగ వివ‌క్ష స‌మ‌స్య‌ల‌పై ప‌ని చేశారు. ప‌లు సంస్థ‌ల‌తో క‌లిసి పని చేసింది.

సంఘ‌త్ సంస్థ‌కు స‌ల‌హాదారుగా ఉన్నారు. భార‌త దేశంలోని మ‌హిళ‌ల నుంచి నిజ‌మైన క‌థ‌ల‌ను ఎప్ప‌టికీ కోల్పోకండి అంటూ

త‌న స్వ‌రాన్ని వినిపించింది. ఊర్వ‌శి బుటాలియా 1984లో రీతూ మీన‌న్ తో క‌లిసి కాళి అనే మొద‌టి స్త్రీవాద ప్ర‌చుర‌ణ సంస్థ‌ను స్థాపించారు.

భార‌తీయ స‌మాజంలో మ‌హిళా ర‌చ‌యిత‌ల పాత్ర‌ను పెంచేందుకు , మెరుగు ప‌రిచేందుక‌,

ప్రోత్స‌హించేందుకు ఓ వేదిక‌ను ఏర్పాటు చేశారు.ర‌చ‌యిత‌గా లింగ వివ‌క్ష‌, మీడియా, మ‌త‌తత్వం, ఫండ‌మెంట‌లిజంపై రాశారు.

ఆమె ర‌చ‌న‌లు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, ఔట్ లుక్ త‌దిత‌ర ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

ఇక దుర్గాబాయ్ దేశ్ ముఖ్(Famous Feminsts) సామాజిక కార్య‌క‌ర్త‌, న్యాయ‌వాది, రాజ‌కీయ వేత్త‌.

మ‌హిళా విముక్తి కోసం ప్ర‌జా ఉద్య‌మ‌కారిణిగా గుర్తింపు పొందారు.

1937లో ఆంధ్ర మ‌హిళా స‌భ‌ను స్థాపించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డును స్థాపించారు.

భార‌త రాజ్యాంగ స‌భ‌, భార‌త ప్ర‌ణాళికాద సంఘంలో స‌భ్యురాలు కూడా. మ‌రో స్త్రీవాది అమృత ప్రీత‌మ్ క‌వయిత్రిగా, ర‌చ‌యిత‌గా పేరొందారు.

అట్ట‌డుగు కులాల ప‌ట్ల భిన్న‌మైన వైఖ‌రిని అంగీక‌రించేందుకు నిరాక‌రించారు. 100కి పైగా క‌విత‌లు,

వ్యాసాలు, జీవిత చ‌రిత్ర‌ల పుస్త‌కాలు రాశారు. ఆమె ర‌చ‌న‌ల్లో పింజార్ ర‌చ‌న గొప్ప న‌వ‌ల‌. స్త్రీల‌పై జ‌రుగుతున్న హింస‌ను ప్ర‌స్తావించింది.

ఇది సినిమాగా కూడా వ‌చ్చింది. సాహిత్య అకాడెమీ పుర‌స్కారం అందుకుంది. ఉమా నారాయ‌ణ్ ప్ర‌సిద్ది చెందిన ఫెమినిస్ట్.

ర‌చ‌యిత గా పేరొందారు. ఆమె రాసిన పుస్త‌కాలు సంచ‌ల‌నం రేపాయి.

యూపీలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన సంప‌త్ పాల్ దేవి పితృస్వామ్య ఆధిప‌త్యానికి వ్య‌తిరేకంగా పోరాడారు.

పురుషుల హింస‌కు వ్య‌తిరేకంగా ఆమె ఉద్య‌మించారు.

గొంతు లేని మ‌హిళ‌ల‌కు సాధికార‌త‌ను అందించారు. రూత్ వ‌నిత భార‌తీయ విద్యా వేత్త‌, కార్య‌క‌ర్త‌, ర‌చ‌యిత కూడా.

1978లో మానుషి అనే ప‌త్రిక‌ను స్థాపించారు. డ్యాన్సింగ్ విత్ ది నేష‌న్ అనే పుస్త‌కం(Famous Feminsts) సంచ‌ల‌నం క‌లిగించింది.

ఇందులో బొంబాయి సినిమాకు వేశ్య‌ల ప్ర‌యాణం గురించి చెబుతుంది. 200 చిత్రాల‌ను విశ్లేషించింది. హిందూ త‌త్వ శాస్త్రంపై కూడా ప‌రిశోధ‌న చేసింది.

క‌వితా కృష్ణ‌న్ అఖిల భార‌త ప్ర‌గ‌తిశీల మ‌హిళా సంఘం కార్య‌ద‌ర్శి. సీపీఐ ఎంఎల్ పొలిట్ బ్యూరోలో ఓ భాగంగా ఉన్నారు. మ‌హిళ‌ల‌పై హింస‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసింది.

ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసింది. ఇరోమ్ ష‌ర్మిల ది ఐర‌న్ లేడీగా ప్ర‌సిద్ది చెందింది. పౌర హ‌క్కుల కార్య‌కర్త‌గా ప‌ని చేసింది. రాజ‌కీయ కార్య‌క‌ర్త‌గా, స్త్రీవాదిగా గుర్తింపు పొందింది.

మ‌ణిపూర్ కు చెందిన క‌వ‌యిత్రి. 2000 నుంచి 2016 వ‌ర‌కు 16 ఏళ్ల పాటు నిరాహార‌దీక్ష చేప‌ట్టిన మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించింది. మేధా పాట్క‌ర్ ఉద్య‌మ‌కారిణిగా పేరొందారు.

మ‌రొక‌రు మాన‌సి ప్ర‌ధాన్ .. ఆమె కూడా స్త్రీవాదిగా పేరొందారు. మ‌హిళ‌ల‌పై హింస‌ను అంతం చేసేందుకు దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే ఆన‌ర్ ఫ‌ర్ ఉమెన్ నేష‌న‌ల్ క్యాంపెయిన్ వ్య‌వ‌స్థాప‌కురాలు.

Also Read : ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం

Leave A Reply

Your Email Id will not be published!