Women Farmers : భారత దేశ చరిత్రలో అపూర్వమైన పోరాటంగా నిలిచి పోతుంది రైతులు జరిపిన ఉద్యమం. ఏడాదికి పైగా ఈ పోరాటం కొనసాగింది. సంయుక్త కిసాన్ మోర్చా సారథ్యంలో రైతు సంఘాలు సుదీర్ఘ కాలం పాటు ఉద్యమించారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకు వచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా వారు నినదించారు. రైతులకు మద్దతుగా మహిళలు(Women Farmers )సైతం తమ గళాన్ని వినిపించారు. వారిపై లాఠీలు ఝులిపించినా, దాడులకు పాల్పడినా తట్టుకుని నిలబడ్డారు.
పురుషులతో సమానంగా వారు తమ పోరాటాన్ని కొనసాగించారు. వీరు చేసిన అలుపెరుగని పోరాటం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఏకంగా ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన టైమ్ పత్రిక వీరి ఫోటోతో(Women Farmers )కథనాన్ని ప్రచురించింది.
సామాజిక మాధ్యమాలలో వీరు హల్ చల్ చేశారు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచారు. ఆకాశంలోనే కాదు వ్యవసాయంలో కూడా తాము భాగస్వాములమేనని చాటారు. కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా నినదించారు.
తమ కుటుంబాలతో కలిసి సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సాగు చట్టాలు రైతుల పాలిట ఉరిత్రాళ్లు అని ఆరోపించారు. తాము కూడా రైతులమేనని, ఈ మట్టిని కోల్పోయేందుకు తాము సిద్దంగా లేమంటూ ప్రకటించారు.
ఒక రకంగా విస్మరించ లేని చరిత్రకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా కేంద్రం మొదటిసారిగా తన తప్పును తెలుసుకుంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కానీ మహిళలు చేసిన పోరాటం ఒక పాఠంగా ఎప్పటికీ మిగిలి పోతుందన్నది వాస్తవం.
Also Read : చెన్నై నగరం దళిత మహిళకు పట్టం