Sonia Gandhi : సోనియా గాంధీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. భారత దేశ రాజకీయాలలో ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తున్నారు.
ప్రేమించిన భర్తను కోల్పోయిన ఆమె తనను తాను ఆవిష్కరించుకుంది. ఇవాళ దేశ రాజకీయాలలో తనకంటూ
ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని ఆమె చేతల్లో అసాధారణమైన మహిళనని నిరూపించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ధీర వనతి. ఆమె గనుక ఒప్పుకోక పోయి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రం సాధించి ఉండేది కాదు.
ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తూ ఉండవచ్చు. కానీ ఏదో ఒకరోజు సోనియా గాంధీ(Sonia Gandhi) ఈ దేశానికి ప్రధాని కాక పోరు.
1946లో ఇటలీలో పుట్టిన ఆమె రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన భర్త కోసం సంప్రదాయాలను వదులుకుంది.
భారతీయత్వంతో ముడి వేసుకుంది. భర్తను కోల్పోయినా ఎక్కడా అధైర్య పడకుండా ముందుకు సాగింది.
ఇవాళ పార్టీని నడిపిస్తోంది సోనియా గాంధీ. మహిళలు సైతం చట్ట సభల్లో ఉండాలని, వారికి ప్రాతినిధ్యం కల్పించినప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని సోనియా గాంధీ భావిస్తారు.
ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లను కేటాయించేలా చేయడంలో సోనియా కీలక పాత్ర పోషించారు.
ఇద్దరు పిల్లలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వీరిద్దరూ రాజకీయాలలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. తల్లికి అండగా నిలిచారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస పార్టీకి చీఫ్ గా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించారు.
ఆమె ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వ్యక్తిత్వం అసాధారణం కూడా. అందుకే సోనియా గాంధీ ప్రత్యేకం. ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో పేరొందారు.
మొదట్లో కొంత తడబాటుకు గురైనా తానే కష్టపడి దేశానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. వృత్తి పట్ల ఉన్న నిబద్దత ఆమెను గొప్ప నాయకురాలిగా తయారు అయ్యేలా చేసింది.
Also Read : అసాధారణ మహిళలకు సలాం