Dil Se Anjali : కొన్నేళ్లయినా నేటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ సొసైటీతో పోటీ పడుతూ వస్తోంది ప్రముఖ జర్నలిస్ట్ , యాంకర్, ప్రజెంటర్, రచయిత, యూట్యూబర్, ఐడ్రీమ్ కు చెందిన దిల్ సే అంజలి(Dil Se Anjali).
స్వంతూరు ఏపీకి చెందిన వారైనా జీవితం తొలి నాళ్లల్లో కష్టాలు అనుభవించారు. ఒకానొక సమయంలో తినేందుకు సైతం లేక పస్తులున్నారు.
పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలన్న తపన ఆమెను అద్భుతమైన జర్నలిస్టుగా మార్చేసింది.
వేలాది మందిని తన మాటలతో ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఎలా మాట్లాడాలి,
ఎలా నేర్చు కోవాలి, ఎలా బతకాలి, ఎలా ఎదగాలి అని ఆలోచిస్తే ముందు అందరికీ గుర్తుకు వచ్చేది అంజలినే.
ఆమె తొలి నాళ్లల్లో ఈనాడులో పని చేశారు. అక్కడ నేర్చుకున్న పాఠాలు బాగా పనికి వచ్చాయి.
ఆ తర్వాత టీవీ9లో , జీటీవీతో పాటు పలు ఛానళ్లలో పని చేశారు. ప్రస్తుతం ఐడ్రీమ్ ఛానల్ కు పూర్తి స్థాయిలో యాంకర్ గా , ఇంటర్యూవర్ గా పని చేస్తున్నారు.
చాలా మందికి జర్నలిజం అన్నది ఓ ఆటవిడుపు. కానీ నేటికీ వృత్తి పరమైన పేషన్ తో పని చేస్తారు.
అందుకు సంబంధించి కసరత్తు చేస్తారు. నిత్యం చదువుతారు. ఆమె చేసే ఇంటర్వూ చాలా సమాచారంతో కూడుకుని ఉంటుంది.
సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ప్రత్యేకంగా ఎంచుకుంటారు. అవసరమైతే తానే వారి కోసం వెతికి పట్టుకుంటారు.
ఈ సమయంలో ఎన్నో ఇబ్బందులు. ఓ వైపు గృహిణిగా ఉంటూనే తన కెరీర్ ను అత్యున్నతంగా మల్చుకునే స్థాయికి చేరుకున్నారు.
ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ఓ వైపు దిల్ సే ప్రోగ్రాంలో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇంకో వైపు రాస్తూ, చదువుతూ నటిగా నటిస్తూ తన లైఫ్ కు ఓ సార్థకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
కట్టు, బొట్టు, సంప్రదాయం, నాగరికత..ఇలా ప్రతి దానిని ఆమె ప్రస్తావిస్తూనే మనందరికి పరిచయం చేస్తారు. వందలాది మందిని ఏ పత్రికలు, ఛానళ్లు పరిచయం చేయని వారిని అంజలి తన ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చారు.
ప్రస్తుతం యూట్యూబ్ లో ఆమె ఓ సంచలనం.
Also Read : ఆటకే వన్నె తెచ్చిన మిథాలీ రాజ్