Gurbaz : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకున్న జేసన్ రాయ్ స్థానంలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ , బ్యాటర్ గుర్బాజ్ ను తీసుకుంటున్నట్లు గుజరాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా రూ. 50 లక్షలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఆఫ్గాన్ జట్టు నుంచి రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్ లతో పాటు ఇదే టీమ్ లోకి గుర్బాజ్(Gurbaz) కు రావడం విశేషం.
విచిత్రం ఏమిటంటే అండర్ -19 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు ఈ క్రికెటర్. 9 వన్డేలు ఆడి మూడు సెంచరీలు చేసి సత్తా చాటాడు. గుజరాత్ టైటాన్స్ సీనియర్లను కాకుండా జూనియర్లను తీసుకోవడం పైనే సదరు మేనేజ్ మెంట్ ఫోకస్ పెట్టింది.
తుది జట్టులో వృద్దిమాన్ సాహాతో పాటు ఆసిస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అందుబాటులో ఉన్నాడు. రాయ్ ప్లేస్ లో గుర్బాజ్ ను తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది టైటాన్స్ . దీంతో ఇప్పటి దాకా రాయ్ స్థానాన్ని సాహా భర్తీ చేస్తాడని అంతా భావించారు.
గుర్బాజ్ ప్లేస్ కన్ ఫర్మ్ చేయడంతో సాహా పరిస్థితి కష్టంగా మారింది. ఇప్పటికే బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం పూర్తయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు షెడ్యూల్ డిక్లేర్ చేసింది.
ఈనెల 26 నుంచి ఐపీఎల్ -15 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ సీఎస్కే..కేకేఆర్ జట్ల మధ్య జరగనుంది.
Also Read : సన్నీ కామెంట్స్ పై సర్వత్రా ఆగ్రహం