ICC Test Rankings : శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా దుమ్ము రేపిన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా టాప్ లో నిలిచాడు . ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ఇవాళ టెస్టు ర్యాంకింగ్స్ (ICC Test Rankings)విడుదల చేసింది.
ఆల్ రౌండర్ల జాబొతాలో మనోడు సత్తా చాటాడు. మొత్తానికి మనోడికి 406 పాయింట్లు వచ్చాయి. గతంలో టాప్ లో ఉన్న విండీస్ స్టార్ ప్లేయర్ హోల్డర్ ద్వితీయ స్థానంతో సరి పెట్టుకున్నాడు. 382 పాయింట్లు వచ్చాయి.
రవిచంద్రన్ అశ్విన్ 347 పాయింట్లతో థర్డ్ ప్లేస్ తో సరి పెట్టుకున్నాడు. బంగ్లా క్రికెటర్ షకీబ్ హసన్ , ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ , ఆసిస్ ఆటగాడు స్టార్క్, జెమీషన్ , గ్రాండ్ హూం , క్రిస్ వోక్స్ టాప్ 10 లో నిలిచారు.
ఇక శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేలా చేశాడు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఇదే ఇన్నింగ్స్ లో మరో భారత స్టార్ ప్లేయర్ , వికెట్ కీపర్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. శ్రీలంకపై 96 పరుగులు చేసి అవుటయ్యాడు.
Also Read : ‘డాటిన్’ స్టన్నింగ్ క్యాచ్ సెన్సేషన్