Yogi Adityanath : యావత్ దేశం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్,
ఉత్తరాఖండ్ , మణిపూర్ , గోవాలో తిరిగి పవర్ లోకి వస్తుందని స్పష్టం చేశాయి.
మూడింట్లో ఓకే కాగా గోవా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా మధ్య సాగుతోంది.
ఇక పంజాబ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. స్వయం కృతాపరాధమే ఆ పార్టీకి శాపంగా మారింది.
కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది ప్రధాన పార్టీలకు. 117 సీట్లలో 87 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ఇక ఇప్పటికే సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన శిరోమణి అకాలీదళ్ కూడా షాక్ తగిలింది.
ఇక ఉత్తర ప్రదేశ్ లో అన్నీ తానై వ్యవహరించారు ప్రియాంక గాంధీ. కానీ ఆ పార్టీని గట్టెక్కించ లేక పోయారు.
ఇక ఈ ఎన్నికలు తమ పనితీరుకు రెఫరెండమ్ అని ప్రకటించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఆయనే అన్నీ తానై వ్యవహరించారు మోదీ త్రయం. యూపీలో(Yogi Adityanath )ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
యోగీతో పాటు మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటించారు. రైతులపై దాడులకు దిగినా సమాజ్ వాది పార్టీ ఆశించిన మేర పోటీ ఇవ్వలేక పోయింది.
కేవలం 125 సీట్లలో కడపటి వార్తలు అందేసరికల్లా ఉంది. తొలి రౌండ్ లోనే పవర్ లోకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202 సీట్లను దాటేసింది.
ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు ప్రజలు.
యూపీలో బీజేపీతో పాటు కాంగ్రెస్ , ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎం , తదితర పార్టీలన్నీ బరిలో ఉన్నా చివరకు కాషాయానికి పట్టం కట్టారు.
70 ఏళ్ల రాజకీయ చరిత్రలో యోగి ఆదిత్యానాథ్ రికార్డు సృష్టించారు. మోదీ – షా ప్రచార మాయాజాలానికి మిగతా వాళ్లు కొట్టుకు పోయారు.
Also Read : ఫైర్ బ్రాండ్ మహూవా మోయిత్రా