INDW vs WIW : ఓహ్ అద్భుత విజయాన్ని నమోదు చేశారు మన అమ్మాయిలు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సత్తా చాటారు. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ -2022లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ (INDW vs WIW)తో జరిగిన మ్యాచ్ లో భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
ఏకంగా ప్రత్యర్థి జట్టుపై 155 పరుగుల తేడాతో గెలుపొందారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ (INDW vs WIW)ప్లేయర్లు కుప్ప కూలారు. ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయారు. ఓపెనర్లు మెరుపులు మెరిపించినా మిడిల్ ఆర్డర్ సరిగా ఆడలేక పోయింది.
మహిళల వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఝులన్ గోస్వామి నిలిచింది. మొత్తం ఇప్పటి దాకా 40 వికెట్లు పడగొట్టింది. ఆసిస్ మాజీ క్రికెటర్ లిన్ పేరుతో ఉన్న 39 వికెట్ల రికార్డు చెరిపేసింది.
ఇది 31వ మ్యాచ్. ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళా జట్టుకు ఇది రెండో విజయం. మొదట పాకిస్తాన్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కీవీస్ తో ఓడి పోయింది. ఇవాళ మూడో మ్యాచ్.
భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఊహించని రీతిలో భారీ స్కోర్ చేసింది. ఏకంగా మంథాన, కౌర్ లు సెంచరీలు సాధించారు. కీలక పాత్ర పోషించారు.
8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. మంథాన 123 పరుగులు చేస్తే కౌర్ 109 పరుగులు చేసింది. వీరిద్దరి జోడి నాలుగో వికెట్ కు ఏకంగా 184 పరుగులు జోడించారు. టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌటైంది.
Also Read : మెరిసిన మంధాన చెలరేగిన కౌర్