Kandikonda : పాటే ప్రాణ‌మై లోకానికి దూర‌మై

పాట‌కు ప్రాణం పోసిన క‌లం

Kandikonda : తెలుగు సినిమా రంగంలో ఇవాళ విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ సినీ గేయ ర‌చయిత‌గా పేరొందిన కందికొండ యాద‌గిరి ఇవాళ క‌న్ను మూశారు.

ఆయ‌న స్వ‌స్థ‌లం తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నాగుర్ల‌ప‌ల్లి. ఇవాళ ఆయ‌న వ‌య‌సు 49 ఏళ్లు.

ఉస్మానియాలో పీజీ చేశాడు. తెలుగు, రాజ‌నీతి శాస్త్రంలో ఉత్తీర్ణుడ‌య్యాడు.

చిన్న‌ప్ప‌టి నుంచే పాట‌లు రాయ‌డం చేస్తూ వ‌చ్చాడు. ఇంట‌ర్ లో సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి ప‌రిచ‌యం కావ‌డంతో త‌న సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు.

మొద‌ట్లో జాన‌ప‌ద గీతాలు రాశాడు. ఆ త‌ర్వాత సినీ సాహిత్యంపై ఫోక‌స్ పెట్టాడు.

ఇట్లు శ్రావణి సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో అద్భుత‌మైన పాట‌లు రాశాడు. కందికొండ (Kandikonda)రాసిన మ‌ళ్లీ కూయ‌వే

గువ్వా అనే పాట అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక పూరీ జ‌గ‌న్నాథ్, చ‌క్రి, కందికొండ కాంబినేష‌న్ గా మారి పోయింది.

అలాగే కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. కానీ అనారోగ్యం ఆయ‌న‌ను, క‌లాన్ని త‌ల‌వంచేలా చేసింది.

ఇవాళ తెలంగాణ ప్రాంతానికే కాదు సినీ రంగానికి తీర‌ని లోటును మిగిల్చి వెళ్లి పోయాడు కందికొండ‌.

12 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్నాడు. 1000కి పైగా పాట‌లు రాశాడు.

ఇందులో తెలంగాణ జాన‌ప‌ద గీతాలు కూడా ఉన్నాయి. ఆయ‌న బ‌తుక‌మ్మ నేప‌థ్యంలో రాసిన పాట‌లు ఊరూరా మార్మోమ్రోగాయి.

గేయ ర‌చ‌యిత‌నే కాదు అద్భుత‌మైన క‌వి కూడా కందికొండ యాద‌గిరి(Kandikonda).

తెలుగు సినిమాలోని సందర్భోచిత పాట‌ల‌పై థీసిస్ కూడా చేసినందుకు డాక్ట‌రేట్ అందుకున్నారు.

ఆయ‌న‌పై చ‌లం ప్ర‌భావం, తెలంగాణ ప‌ట్ల మ‌మ‌కారం రాసేందుకు దోహ‌దం చేసింది.

ఇడియ‌ట్ లో చూపుల‌తో గుచ్చి చంపకే అన్న పాట బిగ్ హిట్.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న దిశ‌గా సాగిన ప్ర‌యాణంలో మాగాణి మ‌ట్టి మెరుపు అన్న పాట రాశాడు.

ఈరోజే తెలిసింది, సారా స‌ర సై , నీలి నీలి ముత్య‌మ‌ల్లె , చ‌మ‌కు చ‌మ‌కు అనే పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

ఇక అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయిలో చెన్నై చంద్ర‌మా, శివ‌మ‌ణిలో బంగారు రంగు పెద‌వులు,

రామ రామ‌, సూర్య సూర్య సుంద‌రి అని గొప్ప పాట‌లు రాశాడు కందికొండ‌.

స‌త్యం చిత్రంలో ఓరి దేవుడా లోకం మార‌దా అని ప్ర‌శ్నించాడు పాట‌తో. మ‌ధుర‌మే మ‌ధుర‌మే, నేను ప్రేమ‌లో ఉన్నానంటూ రాశాడు.

ఆంధ్రా వాలా మూవీలో మ‌ల్లె తీగ‌రోయ్ , కొక్కోకోల మ‌సా, గిచ్చి గిచ్చి అన్న పాట‌లు ఫేమ‌స్ అయ్యాయి.

ఇక 143 మూవీలో ఎందుక‌ని, క‌ల‌లోన‌, ఓరోరి దేవుడా అన్న సాంగ్స్ , భాగ్య న‌గ‌రా సొట్ట బుగ్గ‌ల‌, తొలి తొలిగా ,

సూప‌ర్ లో హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఓ మేఘ‌మాల‌, దిల్సే క‌ర్ణ‌, పోకిరిలో గ‌ల గ‌ల అని రాశాడు. స్టాలిన్ లో చిరంజీవికి పాట రాశాడు.

ర‌ణంలో చెలి జాబిలి అల్లిపోకుమా , పొగ‌రులో ర‌బ్బా ర‌బ్బా , సీతారాముడులో చెలి చేమంతులే , జీవితం అంత త‌క‌ధిమి,

దేశ ముదురులో నిన్నే నిన్నే , మ‌న‌సులో , ట‌క్క‌రిలో అమ్మీ అమ్మీ,

మున్నాలో మ‌న‌సా నువ్వుండే చోటు చెప్ప‌మ్మా అంటూ హిట్ సాంగ్స్ అందించాడు కందికొండ‌.

నేనింతేలో నువ్వంటే చ‌చ్చేంత పిచ్చి, వెలుగే వ‌ర్షం, క‌ళ కాదుగా , ఓ మ‌గువా పాట‌లు రాశాడు.

చ‌క్రి, మ‌ణి శ‌ర్మ‌, అనూప్ రూబెన్స్ , సందీప్ చౌతా, ఏఆర్ రెహ‌మాన్ ..ఇలా దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల‌కు పాట‌లు రాశాడు కందికొండ‌.

Also Read : జూప‌ల్లి కారు దిగ‌నున్నారా

Leave A Reply

Your Email Id will not be published!