Smriti Mandhana : ఎవరైనా అవార్డు వస్తే చాలు తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ భారత క్రికెట్ జట్టులో కీలక భూమిక పోషిస్తూ వస్తున్న అరుదైన మహిళా క్రికెటర్ స్మృతి మంథాన(Smriti Mandhana ). ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ -2022లో భాగంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది వెస్టిండీస్ పై . మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇందులో స్మృతి మంధాన 123 పరుగులు చేస్తే హర్మన్ ప్రీత్ కౌర్ 109 రన్స్ తో సత్తా చాటింది.
వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 184 పరుగులు జోడించారు. భారత్ కు అపూర్వమైన స్కోర్ తో పాటు అద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడావంటూ మంధానకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్మృతి మంధానకు(Smriti Mandhana ) దక్కింది. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేసింది.
ఈ అవార్డు తనకు మాత్రమే కాదని తనతో పాటు అద్భుతంగా ఆడిన సహచర క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ కు కూడా దక్కుతుందని మైదానం వేదికగా స్పష్టం చేసింది.
దీంతో అక్కడ ఉన్న నిర్వాహకులే కాదు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం లేచి ధన్యవాదాలు తెలిపారు స్మృతి మంధానకు. క్రీడా స్ఫూర్తిని చాటుకున్న గొప్ప క్రికెటర్ అంటూ కితాబు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఒక్క పనితో ఆమె క్రీడా లోకాన్ని విస్తు పోయేలా చేసింది.
Also Read : నిలబడిన భారత్ తడబడిన శ్రీలంక