Pink Ball Test : బౌల‌ర్ల హ‌వా కుప్ప కూలిన లంక

109 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు

Pink Ball Test  : బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న రెండో పింక్ బాల్ టెస్టులో (Pink Ball Test )అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టికే మొద‌టి ఇన్నింగ్స్ లో 252 ప‌రుగుల‌కు ముగించిన భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వ‌హిస్తోంది బీసీసీఐ. వంద శాతం ప్రేక్ష‌కుల‌ను చూసేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త పేస‌ర్లు దుమ్ము రేపారు. మొద‌టి నుంచీ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 6 వికెట్లు కోల్పోయి 86 ప‌రుగుల‌తో ఆట మొద‌లు పెట్టిన శ్రీ‌లంక నాలుగు వికెట్లను 24 ప‌రుగుల తేడాతో కోల్పోయింది. అనంత‌రం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ , మ‌యాంక్ అగ‌ర్వాల్ క్రీజులో ఉన్నారు క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి.

ఇదిలా ఉండ‌గా పింక్ బాల్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. బంతి ఊహించ‌ని రీతిలో స్వింగ్ కావ‌డంతో ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ టెస్టు విజ‌యంతో జోరుమీదున్న భార‌త్ మ‌రోసారి త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టి దాకా భార‌త్ 143 ప‌రుగుల ఆధిక్యం ఉంది. టీమిండియా పేస‌ర్లు మ‌రోసారి త‌మ స‌త్తా చాటారు.

స్టార్ పేస‌ర్ బుమ్రా 5 వికెట్లు పడగొట్ట‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్, మ‌హ్మ‌ద్ ష‌మీ చెరో రెండు వికెట్లు తీశారు. జ‌ట్టులోకి వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశాడు.

ఈ టెస్టు కూడా త్వ‌ర‌లోనే రిజ‌ల్ట్ వ‌చ్చే ఛాన్స్ ఉంది. మొహాలీలో ఇన్నింగ్స్ విజ‌యాన్ని న‌మోదు చేసింది టీమిండియా.

Also Read : ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్

Leave A Reply

Your Email Id will not be published!