Dravid Kohli : లక్మల్ నిష్క్రమణ ద్రవిడ్..కోహ్లీ అభినందన
క్రీడా స్పూర్తిని చాటిన దిగ్గజ ఆటగాళ్లు
Dravid Kohli : ప్రపంచ క్రీడా లోకంలో కొన్ని అరుదైన సన్నివేశాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. దాయాదుల మధ్య మ్యాచ్ అనే సరికల్లా భావోద్వేగాలు ఎక్కువగా పెన వేసుకుంటాయి.
ఆ మధ్య దుబాయి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను పాకిస్తాన్ దారుణంగా ఓడించింది. ఇదే సమయంలో బాగా ఆడిన పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ తో పాటు ఓపెనర్ రిజ్వాన్ ను అభినందించారు విరాట్ కోహ్లీ(Dravid Kohli), రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.
యావత్ ప్రపంచమే కాదు పాకిస్తాన్ క్రీడాభిమానులు సైతం భారత ఆటగాళ్ల ఔదార్యానికి, క్రీడా స్పూర్తికిగా జేజేలు పలికారు. ఇక ప్రత్యర్థులు ఎవరైనా సరే ఆటగాళ్లను అభినందించడంలో ముందుంటారు భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
తాజాగా బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్టులో శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతడి కెరీర్ లో ఇదే ఆఖరి టెస్టు. చివరి బంతిని రవీంద్ర జడేజాకు వేశాడు.
మైదానం నుంచి స్టాండ్స్ లోకి వచ్చిన సురంగ లక్మల్ ను ప్రత్యేకంగా అభినందించాడు ద్రవిడ్. అతడితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ కూడా. ఈ సందర్భంగా భవిష్యత్తులో బాగుండాలని కోరాడు.
సురంగ లక్మల్ ను అభినందించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వీరి క్రీడా స్ఫూర్తికి లంకేయులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : వరల్డ్ కప్ లో ఆసిస్ జైత్రయాత్ర