Puneeth Rajkumar : భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన నటుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar). చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు.
లక్షలాది మంది అభిమానులను స్వంతం చేసుకున్న నటుడిగా పేరొందారు. పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో కీర్తి ప్రతిష్టలు గడించారు.
ఆయన చేసిన సేవలకు గుర్తుగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది ప్రముఖ విశ్వ విద్యాలయం మైసూర్ యూనివర్శిటీ. ఇందులో భాగంగా ఈనెల 22న మేసూర్ యూనివర్శటీ 102వ స్నాతకోత్సవం నిర్వహించనుంది.
ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) సతీమణికి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేయనున్నారు. కన్నడ సినిమా రంగంతో పాటు సామాజిక సేవలను గుర్తించే ఈ పురస్కారం అందజేయనున్నట్లు యూనివర్శిటీ వెల్లడించింది.
అంతకు ముందు సుత్తూరు మఠానికి చెందిన శ్రీ శివరాత్రి రాజేంద్ర స్వామి చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది మైసూర్ యూనివర్శిటీ.
వీరితో పాటు యూనివర్శిటీ మొదటి ఏకైక మహిళా వైస్ ఛాన్సలర్ అయిన సెల్వీ దాస్ కు 1989లో డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
రక్షణ శాస్త్రేవత్త వాసుదేవ్ కల్కుంటే ఆత్రే, జానపద సంగత విధ్వాంసుడు ఎం. మహదేవ స్వామి గౌరవ డాక్టరేట్ లు పొందిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా గౌరవ డాక్టరేట్ ను స్వీకరించేందుకు దివంగత పునీత్ రాజ్ కుమార్ కుటుంబం సమ్మతించిందని యూనివర్శిటీ వీసీ హేమంత్ కుమార్ వెల్లడించారు.
Also Read : మరో వెబ్ సీరీస్ కు సమంత రెడీ