ENGW vs SAW : న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ -2022 లో అనూహ్య ఫలితాలు నమోదవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లండ్ (ENGW vs SAW )కు వరుసగా మూడో ఓటమి పలకరించింది.
ఇంకో వైపు నాలుగు మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టుతో(ENGW vs SAW )జరిగిన కీలక మ్యాచ్ లో ఇంగ్లండ్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేసింది.
మెగా టోర్నీలో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలై క్వార్టర్స్ చేరుకునే ఛాన్స్ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ చేతిలో ఓడి పోయిన ఇంగ్లండ్ తాజాగా సఫారీతో సైతం చాప చుట్టేసింది.
ఇవాళ దక్షిణాఫికా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ప్లాన్ వర్కవుట్ అయ్యింది. దీంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది.
ఆ జట్టులో బ్యూ మోంట్ 62 పరుగులు చేస్తే వికెట్ కీపర్ జోన్స్ 53 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్ కాప్ 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సత్తా చాటింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ టీం మొదట్లోనే ఓపెనర్ లీ వికెట్ ను కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వొల్వార్ట్ 77 పరుగులు చేసి దుమ్ము రేపింది. బ్రిట్స్ 23, లుస్ 36 , మరిజన్నె 32 లు సత్తా చాటడంతో ఇంకా నాలుగు బాల్స్ ఉండగానే విజయ కేతనం ఎగుర వేసింది.
Also Read : లక్మల్ నిష్క్రమణ ద్రవిడ్..కోహ్లీ అభినందన