Amelia Kerr : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ గత నెల ఫిబ్రవరి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ప్రకటించింది. మెన్ కేటగిరీలో భారత క్రికెట్ జట్టు ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాగా విమెన్ కేటగిరీ కింద న్యూజిలాండ్ టీమ్ కు చెందిన అమేలియా కెర్ ను ఎంపిక చేసింది.
21 ఏళ్ల వయసు కలిగిన ఈ స్టార్ ఆల్ రౌండర్ భారత దేశానికి వ్యతిరేకంగా జరిగిన వైట్ బాల్ సీరీస్ లో అద్బుతంగా రాణించింది. అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా సత్తా చాటింది అమేలియా కెర్(Amelia Kerr).
భారత్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడానికి అవసరమైన పరుగుల్ని సాధించింది. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా 117.6 సగటుతో 353 పరుగులతో వన్డే సీరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది.
అదే సమయంలో 5.78 ఎకానమీ తో ఏడు వికెట్లు పడగొట్టింది. అమేలియా కెర్(Amelia Kerr) వరుసగా రెండు , మూడు వన్డే మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది.
119 పరుగులతో అజేయంగా నిలిచి 271 టార్గెట్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ , ఆల్ రౌండర్ దీప్తి శర్మ కంటే ముందు అమీలియా కెర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
వెల్లింగ్టన్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఆధునిక ఆటలో అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలిచింది. అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ ఎంపిక ప్యానల్ కమిటీ వెల్లడించింది.
Also Read : ఇంగ్లండ్ జట్టుపై సఫారీ సవారీ