Michael Vaughan : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన కామెంట్స్ చేశారు. వివాదాస్పద ట్వీట్లు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా మనోడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పవర్ ఫుల్ బ్యాటర్ బాబర్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఆల్ ఫార్మాట్ బ్యాటర్ గా అతడిని పేర్కొన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అరుదైన రికార్డు నమోదు చేశాడు బాబర్.
ఏకంగా 21 ఫోర్లు ఓ సిక్స్ తో 196 పరుగులు చేశాడు. గతంలో యూనిస్ ఖాన్ నమోదు చేసిన రికార్డును తిరగ రాశాడు బాబర్ ఆజమ్. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ ఆజమ్ మరోసారి సత్తా చాటాడు.
ఇప్పటికే టీ20, వన్డే, టెస్టు మ్యాచ్ లలో టాప్ బ్యాటర్ లలో ఒకడిగా ఉన్నాడు పాకిస్తాన్ స్కిప్పర్. ఆజమ్ ఎదుర్కొన్న తీరు, ఆడిన ఆట అద్భుతం అంటూ పేర్కొన్నాడు మైఖేల్ వాన్(Michael Vaughan).
ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎలాంటి తొట్రు పాటుకు లోను కాకుండా అద్భుతంగా ఆడాడు. ఇది ప్రతి కెప్టెన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణమని పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. సామాన్యంగా ఎప్పుడూ విమర్శలు కురిపించే మైఖేల్ వాన్ ఉన్నట్టుండి బాబర్ ఆజమ్ కు కితాబు ఇవ్వడం క్రికెట్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది.
ఆస్ట్రేలియా భారీ టార్గెట్ పాకిస్తాన్ ముందుంచింది. 506 పరుగులు ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది.
ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన బాబర్ ఆజమ్ షఫీక్ తో కలిసి మూడో వికెట్ కు 228 పరుగులు జోడించాడు. దీంతో ఆసిస్ గెలుపును అడ్డుకున్నాడు.
Also Read : చెత్తగా ఆడారు చేతులెత్తేశారు