Miss World 2021 : మిస్ వరల్డ్ మొదటి రన్నరప్ గా శ్రీ షైనీ
అమెరికా..భారత సంతతికి చెందిన వ్యక్తి
Miss World 2021 : అంతర్జాతీయంగా నిర్వహించిన ప్రపంచ అందాల పోటీలకు సంబంధించి 2021 సంవత్సరానికి గాను భారత-అమెరికా సంతతికి చెందిన శ్రీ షైనీ (Sri Shiny) రన్నరప్ గా నిలిచారు.
శ్రీ షైనీ (Sri Shiny) భారతీయురాలు. అయితే అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆమె అమెరికా తరపు నుంచి ఈసారి అందాల పోటీలలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరినీ దాటుకుని మొదటి రన్నరప్ గా నిలిచి చరిత్ర సృష్టించారు.
కాగా పోలాండ్ కు చెందిన కరోలినా బిలావ్స్కా అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ వరల్డ్ 2021 (Miss World 2021)టైటిల్ ను కైవసం చేసుకుంది. శ్రీ షైనీ (Sri Shiny) రన్నరప్ గా నిలవగా కోట్ డి ఐవోర్ కు చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్ గా నిలిచారు.
కరోనా కారణంగా ఈ పోటీలను ఆలస్యంగా నిర్వహించారు. అందాల పోటీలను ఈనెల 16న ఫ్యూర్టో రికోలోని జువాన్ నగరంలో నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఫెమినా మిస్ ఇండియా అవార్డు పొందిన తెలుగు అమ్మాయి మానస వారణాసి (Manasa Varanasi) మిస్ వరల్డ్ 2021(Miss World 2021) లో భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆమె టాప్ 13 మంది పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
కానీ టాప్ ఆరుగురిలో ఎంపిక కాలేక పోయింది. మిస్ వరల్డ్ కిరీటం 2019 లో ప్రపంచ సుందరిగా ఉన్న జమైకాకు చెందిన టోని ఆన్ సింగ్ నుంచి ఈ విశ్వ అందాల కిరీటాన్ని కరోలినా అందుకుంది.
కాగా 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ముఖంతో సహా కాలి పోయింది. జీవితాంతం కృత్రిమ గుండె సాయంతో బతకాలి. అయినప్పటికీ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గతంలో గెలుచుకుంది.
Also Read : రాజమౌళి – అల్లు అర్జున్‌ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్