Glenn Max Well : ఐపీఎల్ లో కోహ్లీని తట్టుకోవడం కష్టం
స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కామెంట్
Glenn Max Well : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Max Well)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈనెల 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది బీసీసీఐ.
ఈ తరుణంలో అన్ని జట్లు ప్రాక్టీస్ లో మునిగి పోయాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గతంలో 8 జట్లు పాల్గొంటే ఈసారి రెండు కొత్త జట్లు అదనంగా చేరడంతో మొత్తం 10 జట్లతో రిచ్ లీగ్ జరగనుంది.
తాజాగా ఆర్సీబీ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ప్రధానంగా విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. గతంలో కెప్టెన్ గా ఉన్నప్పుడే అటాక్ మొదలు పెట్టాడని, ఇక ఇప్పుడు నాయకత్వ బాధ్యతల బరువు నుంచి లేక పోవడంతో దంచి కొట్టడమే మిగిలి ఉందన్నాడు.
ప్రత్యర్థి జట్లకు ఓ హెచ్చరిక చేశాడు. ఒక్కసారి కమిట్ అవుతే కోహ్లీ తన మాట తను వినడని పేర్కొన్నాడు. అవతలి వైపు నుంచి ఏ బౌలర్ ఉన్నాడన్నది చూడడని ఇక ఫోర్లు, సిక్సర్లు కొట్టడమే స్టార్ట్ చేస్తాడని స్పష్టం చేశాడు.
దీంతో మ్యాక్స్ వెల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఒత్తిడి ఉంటేనే దుమ్ము రేపేలా ఆడే కోహ్లీ ఇక భారం అన్నది లేక పోతే రెచ్చి పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు దిగ్గజ ఆటగాడు.
గత సీజన్ నుంచి గ్లెన్ మ్యాక్స్ వెల్ కోహ్లీతో జత కట్టాడు. వీరిద్దరిది మంచి కాంబినేషన్ కూడా. కాగా ఆర్సీబీకి 11 ఏళ్ల పాటు నాయకత్వం వహించినా ఒక్క టైటిల్ కొట్ట లేక పోయాడు.
Also Read : బాబర్ ఆజమ్ అరుదైన రికార్డ్