Daniel Manohar : హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెటర్ డేనియల్ మనోహర్(Daniel Manohar )కు బంపర్ ఆఫర్ లభించింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరిగే ఐపీఎల్ 15వ సీజన్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్ రిఫరీగా మనోహర్ ను ఎంపిక చేసింది. ఈ ఎడిషన్ ప్యానల్ చోటు దక్కించుకున్న వారిలో జువగల్ శ్రీనాథ్ తో పాటు డేనియల్ కు చోటు దక్కింది.
గతంలో ఇవటూరి శివరామ్ , షంషుద్దీన్ , నంద కిషోర్ అంపైర్లుగా వ్యవహరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న వన్డే మహిళా వరల్డ్ కప్ లో విధులు నిర్వహిస్తున్నారు మ్యాచ్ రిఫరీగా హైదరాబాద్ కు చెందిన జీఎస్ లక్ష్మి.
ఇదిలా ఉండగా డేనియల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో మ్యాచ్ రిఫరీగా రావడం ఇదే తొలిసారి. నా కెరీర్ లో ఈ నియామకం మరిచి పోలేనని పేర్కొన్నారు.
గతంలో కరోనా కారణంగా ప్రేక్షకులు లేక పోగా ఈసారి సీజన్ లో బీసీసీఐ మ్యాచ్ లు చూసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో మ్యాచ్ రిఫరీలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నారు మనోహర్.
ఈ టోర్నీకి తాను మానసికంగా సిద్దమైనట్లు చెప్పాడు. ఎడమ చేతి వాటం ఓపెనర్ గా తన కెరీర్ ను కర్ణాటకతో రంజీ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించాడు. 144 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
ఇండియా- ఎ తరపున ఆడాడు. విల్స్ ట్రోఫీ వన్డే లో కూడా పాల్గొన్నాడు. 73 మ్యాచ్ లు ఆడాక 2007-08 సీజన్ లో ఆట నుంచి రిటైర్ అయ్యాడు. మ్యాచ్ రిఫరీగా తనను పంపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు పంపించానని తెలిపాడు మనోహర్.
Also Read : సత్తా చాటేందుకు శాసంన్ సై