Ben Stokes : ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఆటగాడిగా పేరొందాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ . వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో దుమ్ము రేపాడు. తన అద్భుతమైన ఆట తీరుతో సత్తా చాటాడు.
114 బంతులు మాత్రమే ఆడిన స్టోక్స్ 11 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న
స్టోక్స్ మరో రికార్డు కూడా నమోదు చేశాడు. బంతుల్ని అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొట్టడంలో ఆరి తేరాడు.
తన టెస్టు కెరీర్ లో అరుదైన మైలు రాయిని చేరుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 120 రన్స్ చేసిన స్టోక్స్ టెస్టుల్లో 5,000 వేల పరుగులు పూర్తి చేశాడు స్టోక్స్.
క్రికెట్ రంగంలో దిగ్గజాలైన వెస్టిండీస్ కు చెందిన గ్యారీ సోబర్స్ , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,
ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన చేరాడు ఈ దిగ్గజ ప్లేయర్. తన పేరుతో ఉన్న రికార్డును తానే అధిగమించాడు.
టెస్టుల్లో 5 వేల పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు పడగొట్టాడు బెన్ స్టోక్స్(Ben Stokes). ఐదో ఆల్ రౌండర్ గా మరో రికార్డు నమోదు చేశాడు .
సర్ ఇయాన్ బోథమ్ , జాక్వెస్ తో పాటు మనోడు ఉండడం విశేషం.
క్రికెట్ పరంగా చూస్తూ ఆటగాళ్లు ఇంతకు ముందు చరిత్ర సృష్టించారు. సోబర్స్ 93 టెస్టులు ఆడి 8032 రన్స్ చేశాడు 235 వికెట్లు పడగొట్టాడు.
ఇక బోథమ్ 102 టెస్టులు ఆడి 5 వేల 200 రన్స్ చేసి 383 వికెట్లు తీశాడు.
కపిల్ దేవ్ 131 టెస్టులు ఆడాడు. ఇందులో 434 వికెట్లు పడగొట్టి 5 వేల 248 పరుగులు చేశాడు. కలిస్ 166 టెస్టులు ఆడి 292 వికెట్లు తీశాడు. 13 వేల 289 రన్స్ చేశాడు.
వీరితో పాటు ప్రస్తుతం బెన్ స్టోక్స్(Ben Stokes) 78 టెస్టులు ఆడాడు ఇప్పటి వరకు. 170 వికెట్లు తీసి 5 వేల 5 పరుగులు చేశాడు.
Also Read : పిచ్ లపై బీసీసీఐని సంప్రదిస్తే బెటర్